ఎపికి అన్యాయం: "ఎన్టీఆర్, జయలాంటివారి లేమి వల్లే.. చిరు, రజనీ రావాల్సిందే"

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తెలుగు ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్లక్ష్యంపై జరుగుతున్న పోరాటానికి మద్దతునిస్తూ ,విభజన చట్టంలోని హామీలను కేంద్రం నేర్చుకపోవడంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర నిరంకుశ విధానాలకు వ్యరేకంగా పోరాడుతున్నవారికి ఆయన ఓ ప్రకటనలో సంఘీభావం తెలిపారు. తెలుగు వారి ప్రత్యేక హోదా హక్కు ఉద్యమానికి మద్దతు గా గతంలో తమ నిరసన ప్రదర్శన చేసినట్లు ఆయన తెలిపారు.

 ఎపి హక్కులపై తమిళనాడులో నిరసన

ఎపి హక్కులపై తమిళనాడులో నిరసన

తమిళనాడులోని హోసూర్‌లో బారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించినట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని తెలుగు వారికి ఎక్కడ ఏ సమస్య వచ్చిన తెలుగు జాతి అంత ఒకటే అనే నినాదానికి కట్టుబడి తమిళనాడు తెలుగు యువశక్తి ఎప్పుడు ముందు ఉంటుందని ,దక్షిణాది ప్రస్తుతం ఎన్టీఆర్ ,జయలలిత లాంటి నాయకులను కోల్పోవడంతో నాయకత్వ లేమి ఏర్పడిందని ఆయన అన్నారు.

దాని వల్లే ఆటలు

దాని వల్లే ఆటలు

నాయకత్వ లేమి వల్ల కేంద్రం దక్షిణాది ప్రజలతో కేంద్రం ఆటలు ఆడుకొంటోందని , ఇప్పుడు దక్షిణాది ప్రజలందరూ ఒక సంఘటిత శక్తిగా మారి కేంద్రానికి బుద్ధి చెప్పడానికి ఉద్యమించవలసిన అవసరం ఉందని, విభజించు పాలించు అనే విధానంతో గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాది వారు దక్షిణాది ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

 ఎక్కువ ఉన్నా కూడా..

ఎక్కువ ఉన్నా కూడా..

పన్నుల నిష్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కేంద్రానికి ఎక్కువ ఉన్నప్పటికీ,అభివృద్ధి పథంలో ఈ రాష్టలు వేనుకబడి ఉన్నాయని ,స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దక్షిణాది నాయకులందరిని ఉత్తరాది నాయకులు ఎన్నో అవమానలకు గురి చేశారని ,ఈ దేశం ఇంత ఆర్థిక పురోగతిని సాదించడానికి దక్షిణాది నాయకుడైన పి.వి.నరసింహారావు సంస్కరణలే కారణమయ్యారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

 పివి పాలనలో దక్షత

పివి పాలనలో దక్షత

పివి పరిపాలనలో దేశ ప్రజలకు దక్షిణాది నాయకుడి పరిపాలన దక్షతకు నిదర్శనం కాదా అని ఉత్తరాది నాయకత్వాన్ని కేతిరెడ్డి ప్రశ్నించారు. దక్షిణాది ప్రజలందరూ తరతరాలుగా తమకు జరుగుతున్న అన్నాయలకు వ్యతిరేక గా, భాషలకు,పార్టీలకు, మతాలకు అతీతంగా కేంద్రం చూపుతున్నా వివక్షపై పోరాటనికి సిద్ధం గా ఉన్నారని ఆయన అన్నారు.

వీరంతా కూడా..

వీరంతా కూడా..

దక్షిణాదికి చెందిన రజనీకాంత్ , కమలహాసన్, మమ్ముట్టి , మోహన్ లాల్, చిరంజీవి, విశాల్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర తదితరులు దక్షిణాదిపై కేంద్ర వివక్షకు వ్యతిరేకoగా ప్రజ ఉద్యమాల్లో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపి తాము అంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఉత్తరాది వారికి ఇవ్వవలసిన అవసరం ఉందని కేతిరెడ్డి అన్నారు. దక్షిణాది ప్రజల పక్షాన నిలబడవలసిన బాధ్యత వారికి ఉందని అన్నారు. కాబట్టి వెంటనే ఆంధ్ర ప్రాంత ప్రజల పక్షాన నిలవాలని ఆయన వారిని కోరారు.

జల్లికట్టు ఉద్యమం లాగా

జల్లికట్టు ఉద్యమం లాగా

తెలుగు ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తున్న కేంద్ర వైఖరి కి వ్యతిరేకతను తెలియచేయాలని, అప్పుడే దక్షిణాది సత్తా ఎమిటో ఉత్తరాది నాయకత్వానికి దక్షిణాది సత్తా తెలుస్తుందని, జల్లికట్టు ఉద్యమoలాగా చరితాత్మక ఉద్యమానికి నడం బిగించాలని, దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనంపై ప్రజలందరూ ఉద్యమం చేయాలని కేతిరెడ్డి అన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రధానిని నిర్ణయించడానికి దక్షిణాది ప్రజల ఓట్లు కీలకం కావాలని ఆయన అన్నారు.

 మేక్ ఇండియా నినాదంతో మోడదీ

మేక్ ఇండియా నినాదంతో మోడదీ

మేక్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ప్రధాని మోడీ దక్షిణాదిపై ఎందుకు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారో ప్రజల కు సమాధానం చెప్పాలని, జై భారత్ అనే నినాదాన్ని సార్ధకం చేయాలని కేతిరెడ్డి అన్నారు. దక్షిణ భారత్ అనే నినాదంతో ప్రజలు ముందుకు సాగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని, ప్రాంతీయ విద్వేషాలకు తావులేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమతుల్యoగా ఉండేందుకు ప్రధానమంత్రి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం అడుగులు వేయాలని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Yuva Shakti leader Kethireddy Jgadeeswar Reddy demanded special category status to Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి