చంద్రబాబు సీఎంగా ఉంటే వర్షాలు పడవు, పంట నాశనమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన పైన వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన సెటైర్లు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడంటే రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు ఉంటే ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం
ఆయన వల్ల ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం ఉందని. చంద్రబాబు కారణంగానే రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రైతులు రాష్ట్రంలో ఉన్న భిన్న వాతావరణం కారణంగా ఒక్క పంట కూడా వేయలేకపోతున్నారని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బాబు హయాంలో అన్ని గిన్నిస్ బుక్ రికార్డులే: కేతిరెడ్డి సెటైర్
ఇక చంద్రబాబు చేయనివి కూడా చేశానని చెప్పుకుంటాడు అని, ఆయన హయాంలో అన్ని గిన్నిస్ బుక్ రికార్డు లేనని ఎద్దేవా చేశారు. మేము చేసింది కూడా చెప్పుకోలేక పోయామని పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలపై కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ప్రజలు మన వెంట ఉన్నారన్న కేతిరెడ్డి
నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు కూడా నిరుత్సాహపడరాదని, ప్రజలు మన వెంట ఉన్నారని కేతిరెడ్డి ధైర్యం చెప్పారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లిన భారీగా జన సందోహం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి జగన్ ను ఆపడం కోసం రెండు వేల మంది పోలీసులు రంగంలోకి దిగారని ఎద్దేవా చేశారు.
బస్సు ఎక్కితే మధ్యలోనే దించేసి పోతారు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న మహిళల ఉచిత బస్సు పథకం పైన కూడా కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు నుంచి ఫ్రీ బస్సు ఉంటుందని మహిళల సంబరపడి పోతున్నారని, అలా అని బస్సు ఎక్కితే మధ్యలోనే దించేసి పోతారు అంటూ ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులకు కేతిరెడ్డి దిశా నిర్దేశం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు, నాయకులు మూల స్తంభాలు అని, అధికారంలో లేమని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల కోసం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.












Click it and Unblock the Notifications