జూన్ 10 నుంచి రైల్వేలో కీలక మార్పులు
రాబోయే రోజుల్లో పంజాబ్, ఢిల్లీ, కేరళ వెళ్లడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటుంటే ఇది మీకు సంబంధించిన వార్తే. ఢిల్లీ నుంచి కేరళకు నడిచే పలు రైళ్ల షెడ్యూల్స్ ను మార్పు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మార్పు జూన్ 10వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు వర్తిస్తుందని తెలిపింది.
* నెంబర్ 12617 - ఎర్నాకుళం జంక్షన్ - హజ్రత్ నిజాముద్దీన్ మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ సమయం మార్పు చేశారు. ఇకనుంచి ఇది ఎర్నాకుళంలో 10.10కి బయలుదేరుతుంది.
* నెంబరు 12618 - నిజాముద్దీన్ - ఎర్నాకుళం మంగళ లక్షద్వీప్ 10.25 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.

* నెంబర్ - 12483 కొచ్చువేలి-అమృత్‌సర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ 4 గంటల 20 నిమిషాల ముందు బయలుదేరుతుంది.
* నెంబర్ - 20923 తిరునెల్వేలి జంక్షన్ - గాంధీధామ్ జంక్షన్ వీక్లీ హమ్‌సఫర్ సూపర్‌ఫాస్ట్ 2 గంటల 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
* నెంబర్ 12432 - హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దాని షెడ్యూల్ సమయానికన్నా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఆది, మంగళ, బుధవారాల్లో తిరువనంతపురం సెంట్రల్‌కి 01.50 గంటలకు చేరుకుంటుంది.
* నెంబర్ 22149 - ఎర్నాకులం జంక్షన్ - పూణే జంక్షన్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సమయం మార్చారు. ఇది దాని షెడ్యూల్ సమయానికన్నా 3 గంటల ముందుగా బయలుదేరుతుంది. ఆది, శుక్రవారాల్లో ఎర్నాకులం జంక్షన్ నుంచి బయలుదేరుతుంది.
* నెంబర్ - 22655 ఎర్నాకులం జంక్షన్ - హజ్రత్ నిజాముద్దీన్ సూపర్ ఫాస్ట్ రైలు కూడా దాని షెడ్యూల్ సమయానికంటే 3 గంటల ముందు బయలుదేరుతుంది.
* నెంబర్ -12217 కొచ్చువేలి-చండీగఢ్ బై-వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దాని షెడ్యూల్ సమయంకన్నా 4 గంటల 20 నిమిషాల ముందుగా బయలుదేరుతుంది. సోమ, శనివారాల్లో ఇది కొచువేలి నుంచి బయలుదేరుతుంది.












Click it and Unblock the Notifications