Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ రాజకీయాల్లో "కాపు" సమీకరణం: రాధా..మాజీ జేడితో సహా : చిరంజీవి- పవన్ లా కాకుండా ..!!

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. కాపు నేతలంతా పార్టీలకు అతీతంగా ఒక్కటవుతున్నారు. కొద్ది రోజులు వరుసగా అనేక ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా కాపు ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాపు నేతలు తామంతా ఐక్యంగా కలిసి ఉండాలని తీర్మానించారు. ఆ సమయంలో మాజీ మంత్రి గంటా కాపులకు త్వరలోనే అధికారం దక్కుతుందని..అందరు కలిసి కట్టుగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఆ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ..ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సైతం హాజరయ్యారు.

కాపు నేతలంతా ఒకే మాట మీద

కాపు నేతలంతా ఒకే మాట మీద


అయితే, కాపులు ఐక్యంగా ఉండాలని చెబుతూనే..ఇతర వర్గాలను దూరం చేసుకుంటే అధికారం సాధ్యం కాదనే అభిప్రాయం ఆ సమావేశంలో కొందరు నేతలు వ్యక్తి చేసారు. ఇక, కాపు ఉద్యమనేతగా ఉన్న ముద్రగడ కాపు ఉద్యమానికి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన కొత్త రాజకీయ వేదిక బీసీ - ఎస్సీలతో కలిసి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో తాజాగా హైదరాబాద్ లో రాజకీయంగా కీలకంగా ఉన్న కాపు నేతలు సమావేశమయ్యారు. అధికారంలో కాపులు క్రియా శీలకంగా వ్యవహరించేలా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

రాధా..మాజీ జేడీ సైతం హాజరు

రాధా..మాజీ జేడీ సైతం హాజరు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి పరాజయం చేందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు తో సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లా విఫలం కాకుండా.. ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలు్తోంది. కాపులకు రాజకీయంగా శాసించే బలం ఉన్నా.. ఇతరులు అధికారంలో కూర్చొనే విధంగా ఉపయోగించుకోవటమే కానీ, సొంతంగా అధికారం దక్కటం లేదనే అభిప్రాయం వ్యక్తం అయింది.

కాపులకు ప్రాధాన్యత దక్కేలా

కాపులకు ప్రాధాన్యత దక్కేలా

దీని కోసం ఎవరు ఏ పార్టీలో ఉన్నా తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కేలా వ్యవహరించాలనే ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేందుకు నలుగురితో కోర్‌ కమిటీని నియమించారు. ఏ పార్టీకి సంబంధం లేనివారే ఇందులో ఉన్నారు. తామెవరికీ వ్యతిరేకం కాదని, కాపులంతా ఏ పార్టీలో ఉన్నా సామరస్యంగా వ్యవహరించాలని.. అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేది తమ లక్ష్యంగా ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు చెబుతున్నారు. అయితే, ఈ సమావేశానికి మాత్రం వైసీపీకి చెందిన కాపు నేతలు హాజరు కాలేదని తెలుస్తోంది. మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఐక్యంగా..అధికార లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Recommended Video

    2021 Year Ender: Telugu States లో వీళ్ళు మస్త్ ఫేమస్ గురూ | Top Names | Oneindia Telugu
    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా

    అయితే, కొద్ది రోజులుగా కాపు నేతలంగా ఐక్యంగా వేస్తున్న అడుగులు రాజకీయంగా ఏ పార్టీ పైన ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది. అయితే, పార్టీలకు అతీతంగా కాపు వర్గానికి దక్కాల్సిన ప్రాధాన్యత పైన మాత్రమే ఈ సమావేశంలో చర్చించినట్లుగా చెబుతున్నారు. వరుసగా జరిగే సమావేశాల ద్వారా కాపు నేతలు ప్రాతినిధ్యం వహించే పార్టీలు..వారు పోటీ చేసే స్థానాల్లో కాపు ఓటర్ల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో, ఏ పార్టీకి చెందిన వారు ఇందులో కీలక భూమిక పోషిస్తారు.. పార్టీలు కాపులకు ఏ స్థాయిలో ప్రాతినిధ్యం ఇస్తాయి.. రాజకీయంగా ఏ పార్టీ పైన లాభ నష్టాల ప్రభావం చూపిస్తాయనే విశ్లేషణలు సైతం మొదలయ్యాయి. దీంతో..ఇప్పుడు కాపు నేతల సమావేశం .. లక్ష్యాలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+