కలిసి ముందుకు: టీడీపీలో దేవినేని అవినాశ్‌కు కీలక పదవి? అందుకే
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత దేవినేని అవినాశ్‌కు టీడీపీలో కీలక పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని ప్రచారం సాగుతోంది. ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.
ఈ మేరకు ప్రచారం సాగడంతో పాటు జిల్లా నేతలు కూడా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు చెబుతున్నారు. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. దేవినేని నెహ్రూ టీడీపీలో చేరినప్పుడు తన కొడుకు భవిష్యత్తు కోసమే చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

టీడీపీలో క్రియాశీలకంగా దేవినేని అవినాశ్
దేవినేని నెహ్రూ మృతి అనంతరం ఆయన వారసుడిగా అవినాశ్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నెహ్రూ తర్వాత కేడర్ చెదిరిపోకుండా చూశారు. టీడీపీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో అవినాశ్ క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు.

అవినాశ్ చూపించిన వారికి పెద్దపీట
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి పాదయాత్రలు నిర్వహించారు. అవినాశ్ అర్బన్ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. నెహ్రూ బలగం, అవినాశ్ నైపుణ్యత చూసిన టీడీపీ పెద్దలు ఆయన సూచించిన వారికి అర్బన్ కమిటీలో కూడా పెద్ద పీట వేశారని చెబుతున్నారు.

ఉపయోగపడేవారికి స్థానం
దేవినేని నెహ్రూ వర్గంలోని పలువురు నాయకులకు అర్బన్ కమిటీలోని అన్ని కేటగిరిలలో ప్రాధాన్యత కల్పించారు. అనుబంధ సంఘాలలోను మంచి స్థానం కల్పించారని అంటున్నారు. అర్బన్ కార్యవర్గ ఎంపికలో ఎమ్మెల్యే జాబితాతో పాటు 2019లో ఉపయోగపడే వారికీ స్థానం కల్పించారు.

కీలక పదవి
ఇక, అవినాశ్ టీడీపీలో కొద్ది నెలల క్రితమే చేరినప్పటికీ అందరితో కలిసి ముందుకు సాగుతున్నారని అంటున్నారు. దీంతో ఆయనకు జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఆయనను నియమించేందుకు కొందరు జిల్లా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని అంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications