ఏపీకి శుభవార్త.. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైనుపై కీలక అప్డేట్!

కృష్ణా జిల్లా ప్రజలచిరకాల వాంఛ అయిన మచిలీపట్నం రేపల్లె రైల్వే నూతన లైను సాధన కోసం మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో పాటు, రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. కృష్ణా జిల్లా వాసుల యొక్క సమస్యలను, రైల్వే నూతనలైను ఏర్పాటుతో, అటు రైల్వేకు ఇటు కృష్ణా జిల్లా వాసులకు ఒనగూరే ప్రయోజనాలను ఆయన రైల్వే బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు.

మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కోసం రైల్వే బోర్డు చైర్మన్ కు వినతి
సమావేశం అనంతరం మాట్లాడిన ఎంపీ బాలశౌరి త్వరలోనే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో భేటీలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలురైల్వే అంశాలను రైల్వే బోర్డ్ చైర్మన్ దృష్టికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తీసుకువెళ్లారు. ముఖ్యంగా మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైను గురించి రైల్వే బోర్డు చైర్మన్ తో చర్చించారు.

Key update on the Machilipatnam - Repalle railway line

Take a Poll

విజయవాడ జంక్షన్ పైన రైళ్ళ ట్రాఫిక్ భారం తగ్గించే ప్లాన్
ఈ నూతన రైలు మార్గం కోసం గతంలో అనేక ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయని, ఈ మార్గం వలన కోల్ కతా నుండి చెన్నై వెళ్ళే రైళ్ళువిజయవాడ జంక్షన్ మీదుగా వెళ్ళకుండా, మచిలీపట్నం మీదుగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ మార్గం గుండా రైళ్ళు ప్రయాణిస్తే 70 కిలో మీటర్ల మేరకు దూరం తగ్గడంతో బాటు, విజయవాడ జంక్షన్ పైన రైళ్ళ ట్రాఫిక్ భారం కూడా కొంతమేరకు తగ్గుతుందన్నారు.

ముఖ్యమైన కోస్టల్ లైనుగా భవిష్యత్ లో ప్రయోజనం
ప్రయాణ సమయం కలిసి రావడంతో బాటు సరుకు రవాణా ఖర్చులు కుడా గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో పూర్తి కానున్న మచిలీపట్నం పోర్టు నుండి కుడా సరుకుల రవాణాను తక్కవ ఖర్చుతో చేయవచ్చని చైర్మన్ కు ఎంపి వివరించారు. తీరప్రాంతంలో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైనుగా ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని, ప్రధానంగా మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణాలో కీలక మార్గం కాబోతుందని పూరి వివరించారు.

మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలని వినతి
ప్రతిపాదిత కోస్టల్ రైల్వే కారిడార్ లో ( నరసాపూర్ - మచిలీపట్నం - రేపల్లె - నిజాంపట్నం - బాపట్లలను కలుపుతూ) ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ఆయన అన్నారు. అందువలన సదరు మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం యొక్క డి.పి.ఆర్ తయారిని వెంటనే పూర్తిచేసి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయవలసినదిగా ఎంపి కోరారు. అయితే తన విజ్ఞప్తి పైన సానుకూలంగా స్పందించిన రైల్వే బోర్డు చైర్మన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+