ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదవులు, కరెంట్ టీకే: కాళ్లుమొక్కినా అన్న బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే ఉంటానని, 2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని, ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలిపించే బాధ్యత తనదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. కేంద్రం నుండి వచ్చే పదవులు తెలంగాణకే ఇస్తానని చెప్పారు.

ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును హైదరాబాదులో కలిశారు. తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 Khammam district TDP leaders meet Chandrababu

పార్టీ నుండి ఒక్క నాయకుడు వెళ్లిపోతే వందమందిని తయారు చేసే శక్తి తనకు ఉందని చెప్పారు. తాను ఎక్కడికి పోనని, ఇక్కడే ఉంటానని అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బంది వస్తే తాను ముందు ఉంటానని చెప్పారు. ఎవరినీ వదిలి పెట్టే సమస్య లేదన్నారు. ఖమ్మం వస్తానని, పది సీట్లు గెలిపించే బాధ్యత తనదే అన్నారు. 2019లో అధికారం తమదే అన్నారు.

గెలిచిన రెండు నెలలకే పార్టీని వీడుతున్నారన్నారు. ముప్పయ్యేళ్ల పాటు పార్టీలో ఉండి, పార్టీలో ఎంతో ఎదిగి, ఎన్నో ఉన్నత స్థానాలను దక్కించుకున్న నేతలు ఇప్పుడు పార్టీని, కార్యకర్తలను మోసం చేసి వెళ్లడమే తనకు బాధ అన్నారు. టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, దీనిని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. పార్టీకి రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలను కొనుక్కుంటోందని ఆరోపించారు. కేంద్రం కేటాయించే పదవులు అన్నింటిని తెలంగాణ టీడీపీ నేతలకే ఇస్తామని చంద్రబాబు చెప్పారు. తెరాసకు టీడీపీ నేతలు ఎవరు కూడా భయపడవద్దన్నారు.

కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని, వారితో కాళ్లు మొక్కినా రుణం తీరదన్నారు. ఆంధ్రాలో కలిసే ప్రాంతాల రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆంధ్రాలో మిగులు విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తామన్నారు. తుమ్మల వంటి నేతలు ఊసరవెల్లి రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. తెరాస అప్పుడే వెలవెల పోయే పరిస్థితి వచ్చిందన్నారు.

English summary
Khammam district Telugudesam Party leaders and activists meet AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X