తిరుమల శ్రీవారి ఆలయంలో సీక్రేట్ గా వీడియో తీసిన కంత్రీ అరెస్టు, ఎలా అంటే !
తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహిళలు, పురుషులు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి స్వామివారి దర్శానానికి పంపిస్తుంటారు. శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులను కనీసం మూడుసార్లు సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించి లోపలికి పంపిస్తుంటారు.
అలాంటి తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో మొబైల్ లో వీడియో తీసిన ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో ఓ వ్యక్తి వీడియో తియ్యడంతో టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది తీరుపై భక్తులు విమర్శలు గుప్పించారు.

అప్పటి నుంచి ఆనంద నిలయంలో వీడియో తీసిన వ్యక్తి కోసం టీటీడీ విజిటెన్స్ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఖమ్మంకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి ఆనంద నిలయంలో వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ఆలయంలోకి తీసుకువెళ్లడం భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని టీటీడీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆనంద నిలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలు చూసి ఖమ్మం భక్తుడు భద్రతా సిబ్బందిని మోసం చేసి ఆలయంలోనికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లినట్లు నిర్ధారించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఆనంద నిలయంలో సీక్రేట్ గా వీడియో తీసిన ఖమ్మంకు చెందిన అతనిని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని తిరుపతికి తీసుకోస్తున్నాట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

శ్రీవారి ఆలయంలో గంటకు 5, 500 మందిని దర్శనానికి పంపించాలి. గురువారం క్షుణంగా తనిఖీ చేయడం వల్ల గంటకు 2, 500 మందిని మాత్రమే దర్శనానికి పంపినట్లు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి చెప్పారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం, కేంద్ర భద్రతాధికారులు తిరుమలకు వచ్చి నూతన భద్రతా వ్యవస్థను రూపొంధించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలో సీసీటీవీ కెమెరాల వ్యవస్థ చాలా బాగుందని, వెనక్కి వెళ్లి ఆనంద నిలయంలో వీడియో తీసిన ఆ అజ్ఞాత భక్తుడిని గుర్తించడం జరిగిందని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి వివరించారు. త్వరలోనే తిరుమలలో అత్యాధునిక భద్రతా పరికరాలు, స్కానింగ్ మిషన్లు, అదనపు భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాకు వివరించారు.
-
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications