చరిత్ర సృష్టించిన కియా- కంగ్రాట్స్ చెప్పిన వైఎస్ జగన్..!!

అనంత‌పురం: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ కియా.. చరిత్ర సృష్టించింది. భారత్‌లో 10 లక్షల కార్లను తయారు చేసింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించిందా కంపెనీ. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ సమీపంలో నెలకొల్పిన కియా ప్లాంట్‌లో ఇవ్వాళ 10వ లక్ష కారును తయారు చేసింది.

నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే 10 లక్షల మార్క్‌ను అందుకుంది కియా. దీని పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కియా ఇండియా యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. మున్ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

KIA India produced their millionth car in 4 years, CM YS Jagan congratulates

పెనుకొండ స‌మీపంలో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై ఏర్పాటైన ఫ్యాక్ట‌రీలో కియా కార్లు తయారవుతోన్న విషయం తెలిసిందే. దేశం మొత్తానికీ ఈ ప్లాంట్ నుంచే కార్లు సరఫరా అవుతోన్నాయి. ప్లాంట్ నుంచి ఉత్ప‌త్తయిన మొట్ట‌మొద‌టి కారును 2019 డిసెంబర్‌లో వైఎస్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. ఆ తరువాత కియా యాజమాన్యం తన ప్లాంట్‌ను సైతం విస్తరించింది.

క‌ర‌వు జిల్లాగా పేరున్న అనంత‌పురంలో కియా కార్ల త‌యారీ ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి ఎవ‌రి హ‌యాంలో బీజం ప‌డింద‌నే అంశంపై గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కియా కార్ల త‌యారీ ఫ్యాక్టరీని అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేయాల‌ంటూ 2007లోనే అప్ప‌టి ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌మ‌కు విజ్ఞ‌ప్తి చేశామ‌ని అంటూ కియా మోటార్స్ అధినేత వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌యాంలో ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాప‌న జ‌రిగింది. క‌ర‌వు జిల్లాకు తానే కియా కార్ల ప‌రిశ్ర‌మ‌ను తీసుకొచ్చానంటూ చంద్ర‌బాబు చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడీగా చంద్రబాబు ఓ కారును కూడా ఆవిష్క‌రించారు. అది అప్పట్లో వివాదానికి కారణమైంది.

జర్మనీ నుంచి దిగుమ‌తి చేసుకున్న కారును అనంత‌పురం ప్లాంట్‌లో ఉత్ప‌త్తి చేసిన‌ట్లు చూపించార‌ని, ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొంద‌డానికే చంద్ర‌బాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్ర‌యోగించార‌ని అంటూ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ఆ తరువాత- కియా ప్లాంట్.. చెన్నైకి వెళ్లిపోయిందంటూ చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో భారీగా ప్రచారం చేశారు. అదంతా తప్పుడు ప్రచారమంటూ కియా ఇండియా యాజమాన్యం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+