విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా తండ్రి మృతికి మీదే బాధ్యత, అంతా మీ వల్లే: పవన్ కళ్యాణ్‌పై మంత్రి కిడారి శ్రవణ్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని జనసేనాని బుధవారం నిప్పులు చెరిగారు. దీనికి శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. మన్యంలో అశాంతికి పవన్‌ కళ్యాణే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.

బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలంబాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలం

మన్యంలో ఆజ్యం పోశారు

మన్యంలో ఆజ్యం పోశారు

ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆజ్యం పోసి తన తండ్రి, సోమ మృతికి కారణమయ్యారని ఆరోపించారు. పాడేరు సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాల జీవో నిలిపివేశారన్నారు. తన తండ్రి బాక్సైట్‌కు వ్యతిరేకంగా గళమెత్తారన్నారు. ఏజెన్సీలో జాబ్‌మేళా, యువతకు శిక్షణ, నిరుద్యోగ భృతితో చంద్రబాబు ఉపాధి కల్పించి యువత పక్కదారి పట్టకుండా చూస్తున్నారని చెప్పారు.

నా తండ్రి చావుకు మీదే బాధ్యత.. ఆ రోజు నుంచే.. అంతా నీ వల్లే

నా తండ్రి చావుకు మీదే బాధ్యత.. ఆ రోజు నుంచే.. అంతా నీ వల్లే

తన తండ్రి కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కోల్పోవడానికి ముఖ్యమంత్రి కంటే మీరే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కిడారి శ్రవణ్ అన్నారు. శాంతంగా ఉన్న మన్యంలో ఆనాడు పాడేరు సభలో పవన్ మాట్లాడి ఆజ్యం పోశారన్నారు. అందుకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. ఇద్దరు గిరిజన నేతలు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శకు కూడా రాలేదన్నారు. అలాంటి మీరు మన్యం గిరిజనుల గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు.

 పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం సరికాదు

పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం సరికాదు

బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని కిడారి శ్రవణ్ అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పవన్ కళ్యాణ్ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పని చేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

English summary
Andhra Pradesh minister Kidari Sravan on Thursday fired at Jana Sena chief Pawan Kalyan for his comments on AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X