అరెస్టు: పాతబస్తీ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పట్టుకున్నారు. అక్షయ్ తండ్రి గోపాల్ వద్ద పనిచేస్తున్న రామ్ ప్రసాద్ అనే వ్యక్తే ఈ అపహరణకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. టపాకాయలు ఇప్పిస్తానని చెప్పి రామ్ ప్రసాద్ అక్షయ్‌ని తన వెంట తీసుకుని వెళ్లి పశ్చిమ బెంగాల్ తీసుకుని వెళ్లాడు.
రామ్ ప్రసాద్ అక్షయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ మూడు కిలోల బంగారం ఇస్తే అక్షయ్‌ను వదిలేస్తానని హెచ్చరిస్తూ వస్తున్నాడు. శుక్రవారం కూడా అతను ఫోన్ చేశాడు. అక్షయ్ కిడ్నాప్ కేసు విచారణకు రెండు పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. ఇందులో ఓ బృందం అనుమానం వచ్చి పశ్చిమ బెంగాల్ వెళ్లింది. రామ్ ప్రసాద్ ఫోన్ కాల్ ఆధారంగా అతన్ని పట్టుకుంది.
కిడ్నాపర్‌ను, రెండున్నరేళ్ల బాలుడు అక్షయ్‌ని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్షయ్ తండ్రి గోపాల్ బంగారం వ్యాపారి. రామ్ ప్రసాద్ గోపాల్ వద్ద పనిచేస్తూ గొడవ పడి పని మానేశాడు. ఆ తర్వాత సర్ధి చెప్పుకుని మళ్లీ పనిలో చేరాడు. పనిలో చేరిన తర్వాత అక్షయ్ కిడ్నాప్‌నకు రామ్ ప్రసాద్ ప్రణాళిక రచించి అమలు చేశాడని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications