కిడ్నాప్ చేసిన బాలుడి హత్య: ఆటో బోల్తాతో మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని చంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. పది రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలుడు కారుణ్యను దుండుగులు హత్య చేశారు. బాలాపూర్‌లో కరుణాకర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడిని మల్లికార్జున్, మోహన్‌లు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో శనివారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటో వికారాబాద్ నుంచి తాండూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications