జగన్ ఆ నియామకంతో సీనియర్ నేత పార్టీకి గుడ్ బై..!!
గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఓడిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. అనుభవం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఇవ్వకుండా వేరే వ్యక్తికి మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వటంతో ఉమ్మారెడ్డి కుటుంబం పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ అధికారంలోకి రాగానే కనీస గౌరవం కూడా లభించలేదన్నారు. పార్టీని మోసం చేసిన వ్యక్తులను చేరదీసి గౌరవించారని కీలక వ్యాఖ్యలు చేసారు.

పార్టీలో గ్రూపులు తయారు చేసినవారు ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. పొన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. చెప్పుడు మాటలు విని అధినేత తనకు పొన్నూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదన్నారు. అన్నివిధాలా నేను పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. సమాజంలో విలువ లేని వ్యక్తిని, పార్టీ ఓటమి కోసం పని చేసిన వ్యక్తిని చేరదీశారుని విమర్శించారు. ఎంతో అనుభవం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఇవ్వకుండా వేరే వ్యక్తికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారంటూ పరోక్షంగా అప్పిరెడ్డి నియామకం ను ప్రస్తావించారు.
కొందరు పెద్దల సొంత నిర్ణయాలతోనే పార్టీని నడిపిస్తున్నారంటూ రోశయ్య వ్యాఖ్యానించారు. రోశయ్య త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు సమాచారం. అప్పిరెడ్డిని శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయటం పైన పార్టీలో చర్చ సాగుతోంది. ఉమ్మారెడ్డిని కాదని అప్పిరెడ్డిని ఎంపిక చేయటంతో ఇప్పుడు రోశయ్య పార్టీ వీడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications