అనుమానం: భార్యను నరికి చంపి, పోలీసులకు లొంగిపోయిన భర్త
గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో భార్యను దారుణం గా నరికి చంపాడు ఓ భర్త. తాను ఏ గొడ్డలితో భార్యను హతమార్చాడో, ఆ గొడ్డలితో సహా పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.
గుంటూరు: గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో భార్యను దారుణం గా నరికి చంపాడు ఓ భర్త. రెంటాల లో నివాసం ఉంటున్న ఈ జంట భర్త పేరు పరమేశ్వరరావు(50) భార్య పద్మావతి (45) గత రెండు, మూడు రోజులుగా భర్త పరమేశ్వరరావు మానసిక పరిస్థితి బాగోలేక పిచ్చి, పిచ్చి గా వ్యవహరించాడు.
ఈ క్రమంలోనే తెల్లవారుఝామున భార్యతో గొడవ పడ్డ పరమేశ్వర్ భార్యను గొడ్డలితో దారుణంగా నరికి హత్యచేశాడు. పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య చనిపోయిందా...? లేదా...?అని మరీ పరిశీలించి తాను ఏ గొడ్డలితో భార్యను హతమార్చాడో, ఆ గొడ్డలితో సహా పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.

తన భార్య పై అనుమానం ఉందని అందుకే నా భార్యని గొడ్డలితో నరికి చంపానని పరమేశ్వర రావు రెంటచింతల పోలీసు స్టేషన్ లో లొంగి పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications