వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడే కష్టాలైతే: బుగ్గ నిమురుతూ జగన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కారణమైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గుండెపోటు వచ్చేలా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల గూబగుయ్‌మనేలా రాష్ట్ర ప్రజలు గర్జించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయ్స జగన్మోహన్ రెడ్డి శనివారం అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పలుచోట్ల వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు.

రానున్న నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో తమ పార్టీ అధికారం చేపడుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కొన్నాళ్లపాటు ఓపిక వహించాలని, తమ ప్రభుత్వం రాగానే కష్టాలన్ని తీరుస్తామన్నారు. రాష్ట్రం నుండి 30 మంది తమ పార్టీ నుండి ఎంపీలు గెలువబోతున్నారని, ప్రధానమంత్రి ఎవరనేది తామే నిర్ణయించే స్థితిలో ఉంటామన్నారు.

కాంగ్రెసు కుట్రలు చేసి తనను జైలుపాలు చేసినా తాను ఆ పార్టీతు కుమ్మక్కు కాలేదని, సమైక్య రాష్ట్రం కోసం పోరాటం సాగిస్తున్నానన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ రాష్ట్రాన్ని విడగొట్టలేదనన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం వల్ల కాంగ్రెసు పార్టీ రాష్ట్రంతో చదరంగం ఆడుతోందని విమర్శించారు.

జగన్ సమక్షంలో...

జగన్ పర్యటనలో కొంత రభస జరిగింది. బయ్యప్పగారిపల్లెకు చెందిన పార్టీ కార్యకర్త ఒకరు జగన్ కాన్వాయ్‌లో ద్విచక్ర వాహనంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో గన్‌మెన్ అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కనిగలతోపులో జరిగిన సభలో నియోజకవర్గ నేత రంగారెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్‌తో కలిసి రంగారెడ్డిని వేదిక పైకి రానివ్వలేదు.

జగన్ 1

జగన్ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావంపై చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్ 2

జగన్ 2

రాష్ట్రంలో ఓట్లు, సీట్లుకోసం సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు విభజనకు అనుకూలంగా భజన చేస్తున్నారని విమర్శించారు.

జగన్ 3

జగన్ 3

ఢిల్లీ అహంకారానికి తెలుగుజాతి గౌరవానికి జరుగుతున్న అంతర్యుద్ధంలో సమైక్యమే గెలుస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జగన్ 4

జగన్ 4

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరు ఉద్యమబాటలో ఉద్యమాలు చేస్తుంటే సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డి, టిడిపి నేత చంద్రబాబులకు అర్ధం కాలేదని, సోనియాకు అసలు అర్థం కాలేదని.. రాహుల్‌ను ప్రధాని చేయడానికి కళ్లుండీ.. కబోదిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ 5

జగన్ 5

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఇన్ని నీటి కష్టాలు వస్తున్నాయని, విడిపోతే ఆంధ్రాకు సముద్రం నీరే గతి అన్నారు. చేనేత కార్మికులను, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

జగన్ 6

జగన్ 6

2014 ఎన్నికల్లో ముప్పై సీట్లను గెలుచుకొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారిని ప్రధానమంత్రిని చేద్దామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు.

జగన్ 7

జగన్ 7

చిత్తూరు జిల్లా పర్యటనలో ఓ కార్మికురాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Sunday said CM Kiran Kumar Reddy and TDP chief Nara Chandrababu Naidu are cooperating with the High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X