వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్, పీలేరులో ఇలా..

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం టీడీపీలో చేరారు. కిషోర్ కుమార్‌కు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Nallari Kishore Kumar Reddy Joined TDP : Watch

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం టీడీపీలో చేరారు. కిషోర్ కుమార్‌కు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కిషోర్ రాకతో బలపడిన టీడీపీ

కిషోర్ రాకతో బలపడిన టీడీపీ

కిషోర్ కుమార్‌ తనయుడు అమర్నాథ్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున అనుచరులు తరలి వచ్చారు.గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్‌కు 44వేల ఓట్లు వచ్చాయి. కిషోర్‌ తమ పార్టీలోకి రావడంతో పీలేరు నియోజకవర్గంలో టీడీపీ బలపడుతుందని నేతలు భావిస్తున్నారు.

బాబును కలిసిన పీలేరు ఇంచార్జ్

బాబును కలిసిన పీలేరు ఇంచార్జ్

కిషోర్ కుమార్ రెడ్డి చేరిక నేపథ్యంలో అంతకుముందు పీలేరు టీడీపీ ఇంచార్జ్ ఇక్బాల్ అహ్మద్ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయనకు అధినేత నచ్చచెప్పారు. అందరికీ సమన్యాయం చేస్తామని, పార్టీ బలోపేతం కోసం కొత్త వారితో సమన్వయంతో ముందుకు వెళ్లాలని బాబు సూచించారు.

అప్పుడే మార్గం

అప్పుడే మార్గం

కాగా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే తన చేరికపై మార్గం సుగమం చేసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీపై మాత్రం సస్పెన్స్ కనిపించనుంది.

అలా టీడీపీ బలపడుతుంది

అలా టీడీపీ బలపడుతుంది

చిత్తూరు జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొంది. అయితే కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను టిడిపిలో చేరేలా ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

English summary
Former Chief Minister Kiran Kumar Reddy brother Kishore Kumar joined Telugudesam Party in the presence of AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X