జై సమైక్యాంధ్ర: కిరణ్ దుకాణం మూసేశాడు (ఫొటోలు)
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయాన్ని మూసేశారు. దాంతో పార్టీని ఆయన ఎత్తేసినట్లేనని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఏ మాత్రం సత్తా చాటకపోవడంతో ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు కార్యాలయానికి రావడమే మానేశారు.
ఎన్నికల తర్వాత పార్టీ సమావేశాలు గానీ భవిష్యత్తు కార్యాచరణపై గానీ ఏ విధమైన చర్చలు, సమీక్షలు లేవు. అసలు పార్టీ సమావేశాలే జరగలేదని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ తర్వాత పార్టీ గురించి మాట్లాడలేదు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
హైదరాబాదులోని మాదాపూర్‌లో ఎన్నికలకు ముందు పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. దాన్ని ఇప్పుడు పూర్తిగా మూసేశారు. మాదాపూర్‌లోని కృతికా లేఅవుట్‌లో ఐదంతస్థుల భవనానికి ఉన్న పార్టీ పోస్టర్లను, బ్యానర్లను, జెండాలను రెండు రోజుల క్రితం తొలగించారు.
రెండు రోజుల క్రితమే కార్యాలయం నుంచి ఫర్నీచర్‌ను, స్టేషనరీని తరలించినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. బిజెపి తెలంగాణ నేత జి. కిషన్ రెడ్డి భేటీతో ఆ ప్రచారం ఊపందుకుంది.

ఎన్నికలకు ముందు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని మాదాపూర్‌లో జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం ఎన్నికలకు ముందు ఇలా కనిపించింది.

ఎన్నికలకు ముందు
ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఛాయాచిత్రంతో జై సమైక్యాంధ్ర కార్యాలయం ఇలా కనిపించింది.

ఎన్నికల తర్వాత
ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర కార్యాలయం ఇలా కనిపిస్తోంది.

ఎన్నికల తర్వాత
ఎన్నికల తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ మిగల్చలేదు. ఆ భవనం అద్దె కోసం పలు బడా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications