దూసుకెళ్తూ మనభూమిపై గీతలా: కిరణ్ ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: అత్యాధునిక పరిజ్ఞానంతో ఆకాశంలోకి దూసుకెళ్తున్న మనం భూమి పైన గీతలు గీసుకోవడం బాధాకరమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో సమూహ ఏరో స్పేస్ పార్కుకి కిరణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరంగా పై వ్యాఖ్యలు చేశారు.
అందరి ఆమోదంతో దీనిని స్పేస్ సిటీగా ప్రకటిస్తామన్నారు. పార్క్‌కు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నరు. దేశ అభివృద్ధిలో రాష్ట్రమే ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

కాగా, ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు ప్రతిచోట సమైక్య గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం జరిగిన అవతరణ దినోత్సవంలో ఆయన గట్టిగా తన వాణిని వినిపించారు.
బొత్సను ప్రశ్నించిన రేణుక
కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సోమవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సమావేశంపై ప్రశ్నించారు. ఉదయం టి కాంగ్రెసు నేతలతో బొత్స భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కొందరు ఎంపీలనే ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. దీంతో తాను ఎంపీలను పిలవలేదని, మంత్రులను మాత్రమే పిలిచానని బొత్స సమాధానం చెప్పారు.












Click it and Unblock the Notifications