టి దిశగా వెళ్లదు, మళ్లీ గట్టిగా వాదన వినిపిద్దాం!: సిఎం
హైదరాబాద్: సమైక్యాంధ్రపై అధిష్టానం వద్ద మరోసారి గట్టిగా వాదన వినిపిద్దామని, విభజన విషయంలో ఏకపక్షంగా ముందుకెళ్తుందని తాను భావించడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ నేతలు గురువారం మినిస్టర్స్ క్వార్టర్సులో సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మన మాట వినకుండా అధిష్టానం ఏకపక్షంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారట. కేబినెట్ నోట్ వస్తుందో రాదో తనకు తెలియదని, తీర్మానం మాత్రం చేస్తుందని తాను భావించడం లేదని చెప్పారట. విభజన విషయంలో మనమంతా కలిసి ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్దామని, మరోసారి అధిష్టానానికి బలమైన వాదన వినిపిస్తామని చెప్పారట.

కేబినెట్ నోట్ పైన ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారట. నోట్ వచ్చేంత వరకు ఎదురు చూద్దామని చెప్పారు. విభజన విషయంలో సీమాంధ్రలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అడుగు ముందుకు వేసే అవకాశాల పైన ఆయన అనుమానం వ్యక్తం చేశారట. ఆంటోని కమిటీ రాష్ట్రానికి రాకుండా ఎలాంటి నిర్ణయం ఉండదని చెప్పారట. నోట్ వస్తే అందరం రాజీనామా చేద్దామని పలువురు నేతలు సూచించినప్పుడు ఆయన వద్దని వారించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీకి తీర్మానం వస్తే ఓడించేందుకు రాజీనామాలు చేయక పోవడమే మంచిదని సూచించినట్లుగా తెలుస్తోంది.
ఏమైనా అందరం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందామని, ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి తీసుకుందామని సూచించినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించినట్లుగా సేవ్ ఎపి.. సేవ్ కాంగ్రెసు నినాదం పైనా కూడా స్పందించారట. మనమంతా దశాబ్దాలుగా కాంగ్రెసు పార్టీలో ఉంటున్నందున ఎపిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే పార్టీని కూడా కాపాడుకుందామని సూచించారట. సీమాంధ్రలో సభలు పెడతామని పలువురు నేతలు సూచించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications