ఎలా చేస్తారో చూస్తాం: విభజనపై కిరణ్ రెడ్డి ధిక్కారం
గుంటూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. రాష్ట్ర విభజనకు సహకరించబోమని ఆయన చెప్పారు. తాము తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ఓడిస్తామని, అలా ఓడించిన తర్వాత పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూస్తామని ఆయన అన్నారు. కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఆయన సాయంత్రం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. కాంగ్రెసు అధిష్టానంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఆయన మాట్లాడారు.
కెసిఆర్, జగన్, చంద్రబాబు చెప్పారని విభజన చేస్తారా అని ఆయన అడిగారు. తమ సంకల్పం సమైక్యాంధ్ర అని, అది నినాదం కాదు తమ విధానమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విభజనకు తాము ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోబోమని ఆయన అన్నారు. అవసరమైతో కెసిఆర్‌నో, జగన్‌నో, చంద్రబాబునో ముఖ్యమంత్రిని చేసుకోండి గానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండని ఆయన కోరారు. కెసిఆర్ ఆడిగారనో, జగన్ చెప్పాడనో, చంద్రబాబు సహకరిస్తున్నాడనో విభజన చేయడమేమిటని ఆయన అడిగారు.
కెసిఆర్ కోసమో, జగన్ కలుస్తాడనో రాష్ట్ర విభజన చేయడం సమంజసమా అని ఆయన అడిగారు. కాంగ్రెసు కష్టకాలంలో ఉన్నప్పుడు తాము అండగా నిలిచామని, రెండు సార్లు రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను ఇచ్చి కాంగ్రెసును కేంద్రంలో ఆదుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నీరు రాదని, రైతులు కరెంటుకూ సాగునీటికీ కష్టాలు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందుకే తాను విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇరు ప్రాంతాలు కలవకపోతే నాగార్జునసాగర్ గానీ శ్రీశైలం గానీ కట్టుకుని ఉండేవాళ్లం కాదని, నాగార్జున సాగర్‌కు నల్లగొండ ప్రజలు భూములు ఇచ్చిఉండేవారు కాదని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు తాను తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించానని, అవి మిగులు జలాలపై ఆధారపడి నిర్మించామని, విభజన జరిగితే తెలంగాణ ఎగువ రాష్ట్రం అవుతుందని, అందువల్ల వాటికి నీరు రాదని ఆయన అన్నారు.విభజన జరిగితే అందరికీ నష్టమేనని ఆయన అన్నారు. భద్రాచలం మనకు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. విభజన జరిగితే నీరు ఏ విధంగా ఇస్తారని ఆయన అడిగారు. మనమంతా విభజనకు వ్యతిరేకమని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ 1972 డిసెంబర్ 21వ తేదీన పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని మరోసారి ఆయన ఉటంకించారు. దాన్ని చదువుకున్నవారెవరూ రాష్ట్ర విభజనకు అంగీకరించరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగులు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు ఏ ముఖ్యమంత్రి కూడా అన్యాయం చేయలేదని, తెలంగాణలోనే అత్యధికంగా 47 శాతం ఆయకట్టు అదనంగా వచ్చిందని ఆయన చెప్పారు. విభజన అంశం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి బోర్డులు వేస్తామని అంటున్నారని, అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు న్యాయవ్యవస్థ తీర్పుతో సమానమని ఆయన అన్నారు.
హైదరాబాదు కాకుండా తెలంగాణలో విలీనానికి ముందు ఒక్కే సాంకేతిక విద్యాలయం ఉండేదని, ఇప్పుడు వేల కాలేజీలు వచ్చాయని ఆయన చెప్పారు. నిర్ణయం ఎక్కువ జనాభా ఉన్న పక్షాన జరగాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన 75, 80 శాతం మంది ప్రజల మనసును గాయపరుస్తోందని ఆయన అన్నారు. వ్యక్తులూ ప్రభుత్వాలూ శాశ్వతం కాదని, కానీ దేశమూ రాష్ట్రమూ శాశ్వతమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే బలహీనపడుతామని ఆయన అన్నారు.

తెలంగాణకు యాభై శాతం కరెంట్ కొరత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణకు నదీ జలాలు అందిచాలంటే ఎత్తిపోతలు నిర్మించాలని, వాటికి అదనంగా 176 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కావాలని, అందుకు 45 వేల కోట్ల రూపాయలు కావాలని ఆయన అన్నారు. విద్యుత్ కొరతతో పాటు బొగ్గు లేగు, గ్యాస్ లేదు నీరు ఎలా అందిస్తారని ఆయన అడిగారు.
విభజన పొరపాటు నిర్ణయమని, అయితే పునరాలోచన చేసి పొరపాటును సవరించుకుంటే తప్పేమీ కాదని, ఢిల్లీలోని వారు ఆలోచన చేయాలని ఆయన అన్నారు.రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించింది కాదని, దేశానికంతటికీ సంబందించిందని, రాష్ట్ర విభజన దేశమంతటా ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. గత 25, 30 ఏళ్లలో నక్సలిజాన్ని నియంత్రించామని ఆయన చెప్పుకున్నారు. మతతత్వం, టెర్రరిజం ప్రభావం చూపుతుందని ఐబి చీఫ్ చెప్పారని, ఆ మాట తాను చెప్పడం లేదని ఆయన అన్నారు.
కేంద్రంలో మన ప్రభుత్వమే ఉందని, తాము ఏ పాపం చేశామని, చేసిన పాపమంతా కాంగ్రెసు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేయడమేనని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారీ కాపాడామని, ఇందిరా గాంధీకి 1977లో 41 సీట్లు ఇచ్చామని, పదేళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెసుకు 2004లో కాంగ్రెసుకు 29, 30 సీట్లు ఇచ్చామని, 2009లో 33 సీట్లు ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెసుకు ఇంత బలం ఉన్న రాష్ట్రాన్ని అధిష్టానం విభజించాలని అనుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ చెప్పినట్లు విభజిస్తారా, ఇతర పార్టీల నాయకులు చెప్పినట్లు చేస్తారా అని ఆయన అడిగారు.
కూర్చున్న కొమ్మనే కాంగ్రెసు అధిష్టానం నరుక్కుంటోందని ఆయన అన్నారు. రాజకీయానికి రాష్ట్రానికి ముడిపెట్టవద్దని ఆయన అన్నారు. ఓడిపోవచ్చు, గతంలో కూడా ఓడిపోయాం, ఆ తర్వాత మళ్లీ గెలిచామని ఆయన అన్నారు. సీమాంధ్రలో గత 70,80 రోజులుగా పెద్ద యెత్తున ఉద్యమం జరుగుతోందని, ఇంత పెద్ద ఉద్యమాన్ని తాను జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. అది ఢిల్లీకి కనిపించడం లేదు, కళ్లూ చెవులూ, నోరూ మూసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమం కనిపించకపోవడం న్యాయమా, సమంజసమా అని ఆయన అడిగారు. ఇప్పటికైనా మించిపోలేదు, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన అనేది అన్యాయమని తాము చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications