లోకసభకు కిరణ్ రెడ్డి పోటీ: ఇంచార్జీల నియామకం
హైదరాబాద్: తాను ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగా గానీ పోటీచేయబోనని, వచ్చే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేసి గెలవాల్సిన పరిస్థితి ఉందని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన 'మన తెలుగు-మన కిరణ్' పేరిట ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
తాను లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయనున్నట్టు ఈ వెబ్‌సైట్‌లో స్పష్టం చేశారు. పలు నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జులను కిరణ్ కుమార్ రెడ్డి నియమించారు. దాదాపు వీరే ఆయా శాసనసభ స్థానాల నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. తెలంగాణలోని రెండు శాసనసభా నియోజకవర్గాలకు, నల్లగొండ జిల్లాలోని ఒక్క నియోజకవర్గానికి ఆయన ఇంచార్జీలను ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా: పలాస- కె.విశ్వనాథం, టెక్కలి- కొర్ల భారతి, ఆమదాలవలస- పైడి సత్యప్రసాద్, రాజాం (ఎస్సీ)-సవరపు ప్రవీణ, శ్రీకాకుళం-జోగినాయుడు.
విజయనగరం జిల్లా: బొబ్బిలి- వాసిరెడ్డి అనూరాధ.
తూర్పు గోదావరి జిల్లా: రామచంద్రాపురం- టి.వీర రాఘవరావు, అమలాపురం (ఎస్సీ)- నెల్లి కిరణ్‌కుమార్, కొత్త పేట- కేవీ సత్యనారాయణ రెడ్డి.
కృష్ణా జిల్లా: కైకలూరు-బొర్రా చలమయ్య, పెడన- వాకా వాసుదేవరావు, విజయవాడ(పశ్చిమ)- పైలా సోమినాయుడు, జగ్గయ్యపేట- పి.వెంకటరావు.
కడపజిల్లా: కడప- ఎస్.రామచంద్రారెడ్డి, జమ్మలమడుగు- లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి, ప్రొద్దుటూరు- సీహెచ్ వెంకట సుబ్బయ్య, మైదుకూరు- (విద్యార్థి జేఏసీకి చెందిన) వెనుతుర్ల రవిశంకర్‌రెడ్డి.
అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్-కె.చిరంజీవి రెడ్డి, పుట్టపర్తి-పసుపులేటి రమేష్ బాబు.
కర్నూలు జిల్లా: శ్రీశైలం- లక్ష్మీనరసింహ యాదవ్, నంద్యాల- జహీర్ బాషా.
రంగారెడ్డి జిల్లా:కు త్బుల్లాపూర్-గుంజాశ్రీనివాస్, కూకట్‌పల్లి-పెద్దినరసింహరాజు.
నల్లగొండ జిల్లా: మునుగోడు- కె.వెంకయ్య.












Click it and Unblock the Notifications