సిపిఎంతో కిరణ్ రెడ్డి పార్టీ పొత్తు: సీమాంధ్రలో కలిసి
హైదరాబాద్: జైసమైక్యాంధ్ర పార్టీ, సిపిఎం మధ్య పొత్తు ఖరారైందని ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు బుధవారం ప్రకటన చేశారు. రెండు పార్టీల మధ్య అనేక అంశాల్లో సారుప్యత ఉందని సిపిఎం నేత మధు చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జై సమైక్యాంధ్ర పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుందని సిపిఎం నేత మధు తెలిపారు. తెలుగుదేశం, బిజెపి కలిసి రాష్ట్రంలో మతోన్మాదాన్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా స్పష్టమైనటువంటి వైఖరిని కిరణ్ రెడ్డి పార్టీ తీసుకున్నదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం సీపీఎం కట్టుబడిందని, అందుకే జెఎస్పీతో పొత్తు కుదిరిందని మధు స్పష్టం చేశారు.
18 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో సీపీఎంకు జై సమైక్యాంధ్ర పార్టీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలకున గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికలకు వెళ్తామని జై సమైక్యాంధ్ర నేత కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ కు, అందుకు తెరవెనుక సహకరించిన బీజేపీ, టీడీపీలకు ఎన్నికల్లో గుణపాఠం చెబుతామన్నారు. సిపిఐతో పొత్తు లేదా ఎన్నికల సర్దుబాట్లకు జేఎస్పీ నిరాకరించింది.












Click it and Unblock the Notifications