టి: గవర్నర్‌తో కిరణ్ భేటీ! అడుగు వదలమని బలరాం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడంతో పాటు బడ్జెట్ అంశాలు చెప్పేందుకు గవర్నర్‌తో కిరణ్ భేటీ కావొచ్చని సమాచారం.

మరోవైపు రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఓ నిర్ణయం తీసుకుంటానని, రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడనని కిరణ్ కొద్ది రోజులుగా చెబుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేసే యోచనలో కూడా కిరణ్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో కిరణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సాధారణ భేటీయేనని మరికొందరు చెబుతున్నారు.

Kiran Reddy to meet Governor Narasimhan

కిరణ్‌పై తెరాస ఫైర్

కిరణ్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావులు అన్నారు. సిఎంతో స్పీకర్ కుమ్మక్కయ్యారని, ముఖ్యమంత్రి, స్పీకర్ లకు పదవుల్లో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. సిఎం, స్పీకర్ సీమాంధ్ర నేతల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్యాయం అనడం సమంజసం కాదన్నారు.

అడుగు జాగా వదలం: బలరాం

భద్రచలం డివిజన్‌లో అడుగు జాగా కూడా వదిలేది లేదని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. మేడారం జాతరకు వచ్చిన ఆయన మాట్లడుతూ, అవసరమైతే పోలవరం డ్యాం డిజైన్ మార్చుకుని ఎత్తు తగ్గించుకోవాలి తప్ప భద్రాచలం డివిజన్‌లో ఒక్క అడుగును కూడా సీమాంధ్రకు వదిలేది లేదన్నారు. ఖమ్మం జిల్లాలోని గిరిజన గ్రామాలను ముంచి ప్రాజెక్టు కడతామంటే తాము ఒప్పుకోమన్నారు. తెలంగాణను ఆపేందుకు చంద్రబాబు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడని, తెలంగాణ టిడిపి నేతలు ఆయన తీరును గుర్తించాలని హితవు పలికారు.

బడ్జెట్ తప్పుల తడక: ఎర్రబెల్లి

ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా తప్పుల తడక అని తెలంగాణ టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కేబినెట్‌లో సగం మంది మంత్రుల ఆమోదంలేని బడ్జెట్‌ను శాసనసభలో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+