కిరణ్ రెడ్డికి భుజం నొప్పి: రాయపాటి, మంత్రులు భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి భుజం నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు ముఖ్యమంత్రికి ఫిజియోథెరపీ చికిత్స అంద జేస్తున్నారు.
స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, కొండ్రు మురళి, మహీధర్ రెడ్డి, టీజీ వెంకటేష్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో పరామర్శించారు.

ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డితో గుంటూరు కాంగ్రెసు రాయపాటి సాంబశివర రావు శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తానని, సమైక్య రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతి నొప్పితో బాధపడుతున్నారని, ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్నారని రాయపాటి చెప్పారు.












Click it and Unblock the Notifications