రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి స్పందిద్దాం: కిరణ్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి స్పందిద్దామని,త పదవికి రాజీనామా చేసే విషయంపై నిర్ణయం తీసుకుందామని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెడితే పదవి నుంచి తప్పుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత మంది సీమాంధ్ర నాయకులు ఆయనను కలిశారు. ముందు రాజ్యసభ ఎన్నికలు కానివ్వాలని, రాష్ట్రపతిన నిర్ణయాన్ని బట్టి అడుగేద్దామని ఆయన శుక్రవారం ఉదయం ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి.

Kiran kumar Reddy

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును శాసనసభ తిరస్కరించడాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలా కాకుండా బిల్లును పార్లమెంటుకు పంపిస్తే వెంటనే దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని, అప్పుడు పదవిలో ఉండలేనని ఆయన అన్నారని సమాచారం.

తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్ర ప్రజలే ముఖ్యమని, అందుకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని, దేనికైనా సిద్ధపడుతానని ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం ఓ జాతీయ చానెల్ ప్రతినిధితో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+