వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా మీర్జాపై ఉన్న శ్రద్ధ: కేసీఆర్‌పై కిషన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించడం దేనికి ప్రతీక అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు.

పలువురు పార్టీ నేతలతో కలిసి ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. గోల్కొండ కోట నుంచే నిజాం నియంతృత్వ, నిరంకుశత్వ, అరాచక, అణచివేత, కుటుంబపాలన సాగించారన్నారు.

అలాంటి కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎలా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

‘గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతం కొడుకో' అని నిజాంను తెలంగాణ ప్రజలు హెచ్చరించిన విషయం సీఎం కేసీఆర్‌కు గుర్తు లేదా అని కిషన్ రెడ్డి నిలదీశారు. అక్కడ ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాతిపదిక ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కేసీఆర్‌ కుటుంబ వ్యవహారం కాదని, గోల్కొండ కోటపై ఏవైనా ఉత్సవాలను నిర్వహించాలనుకుంటే ముందుగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచనోత్సవాలను నిర్వహించాలని కిషన్ రెడ్డి అన్నారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌... గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలకు నాంది పలకాలని కిషన్ రెడ్డి సూచించారు. మరోవైపు, రైతులు, విద్యార్థులపై కేసీఆర్‌ కుటుంబం లాఠీ ఎత్తడం ఎంతవరకు న్యాయసమ్మతమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

కరీంనగర్‌ను లండన్‌, న్యూయార్క్‌లాగా మార్చడం, సానియా మీర్జాకు కోటి రూపాయలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, రైతులు, విద్యార్థులు, ప్రజల ఇబ్బందులపై లేదని కిషన్ విమర్శించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

బీజేపీ చీఫ్‌ అమిత్‌షా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఆయన హైదరాబాద్‌ రానున్నారని, 21న తెలంగాణ పదాధికారులతో సమావేశం నిర్వహించనున్నామన్నారు.

English summary
Taking objection to Telangana Chief Minister Chandrasekhar Rao’s decision to celebrate Independence Day at historical Golkonda Fort instead of Secunderabad Parade Grounds, BJP Telangana chief G Kishan Reddy said that KCR instead of organising Independence Day at Golkonda Fort should celebrate “Hyderabad Liberation Day” on September 17 as the state got independence on that particular day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X