ఎప్పటికీ మీరే నా హీరో.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ వైరల్ !!

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లో అదరగొట్టి.. యువరాజుతో హీరోగా ఆరంగేట్రం చేశారు. నాటి నుంచి తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇలా మహేష్ ఖాతాలో లేని సినిమా అంటూ లేదు. రీజినల్ ఫిల్స్ తోనే పాన్ ఇండియా చిత్రాలకు సైతం పోటీ ఇచ్చే స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఈ సూపర్ స్టార్. కాగా నేడు మే 31న కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్టు అభిమానుల హృదయాలను కదిలించింది.

ఈ మేరకు ఆ పోస్టులో.. "Forever my hero... Happy Birthday Nanna" అంటూ మహేష్ బాబు తన తండ్రిని స్మరించుకున్నారు. కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన జీవితంలో ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోదని మహేశ్ మరోసారి తెలియజేశారు. మహేష్ సినీ ప్రయాణానికి పునాది వేసింది కృష్ణే. చిన్నతనంలోనే తన కుమారుడిలోని నటన ప్రతిభను గుర్తించిన కృష్ణ.. బాలనటుడిగా వెండితెరకు పరిచయం చేశారు.

mahesh-babu-emotional-tweet-over-reminding-his-father-super-star-krishna-birth-anniversary

11 సినిమాల్లో తండ్రీకొడుకుల మేజిక్..

కృష్ణ-మహేశ్‌బాబు కలిసి దాదాపు 11 చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ తొలిసారిగా కలిసి కనిపించిన చిత్రం Poratam. ఆ తర్వాత కూడా అనేక చిత్రాల్లో తండ్రీకొడుకులు కలిసి ప్రేక్షకులను అలరించారు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో కూడా మహేశ్ నటించడం విశేషం. తెరపై వారి అనుబంధం ఎంత సహజంగా కనిపించేదో, నిజ జీవితంలోనూ అదే ఆప్యాయత కనిపించేదని సినీ వర్గాలు చెబుతుంటాయి.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, కొత్త జానర్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. Alluri Seetarama Raju వంటి చారిత్రాత్మక చిత్రాలతో పాటు కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ చిత్రాలు, ఈస్ట్‌మన్ కలర్, 70ఎంఎం ఫార్మాట్ వంటి ఎన్నో సాంకేతిక ప్రయోగాలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా కూడా తెలుగు సినిమా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2022 నవంబర్ 15న 79 ఏళ్ల వయసులో కృష్ణ హైదరాబాద్‌లో కన్నుమూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+