సిఎంను సస్పెండ్ చేయండి: కిషన్, బాబు అంటరాని నేత

Kishan Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని, అంతేగానీ తమ పార్టీ నేతలపై విమర్శలు చేయవద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. టిజెఏసి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కమలనాథ్ వక్రీకరించారన్నారు.

సుష్మాకు కమలనాథ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తున్నామే తప్ప బిల్లును అడ్డుకుంటామని తమ పార్టీ నేతలు ఎక్కడ చెప్పలేదన్నారు. విభజన విషయంలో తమ పార్టీపై పల్లెత్తు మాట అనడానికి అవకాశం లేదన్నారు. విభజన బిల్లుకు బిజెపి మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. అద్వానీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్ వరకు అందరూ తెలంగాణకు సానుకూలంగా ప్రకటనలు చేశారన్నారు.

చంద్రబాబు మరెవరో రాజ్‌నాథ్‌ను కలిసినంత మాత్రాన పార్టీ వైఖరి మారదని చెప్పారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించామని, పోషిస్తున్నామని తెలంగాణ వచ్చాక కూడా సీమాంధ్ర ప్రాంతాలను కూడా గుజరాత్ రాష్ట్రంతో పోటీ పడేలా చేస్తామన్నారు. తమ పార్టీ నిర్ణయాన్ని చెప్పడానికి టిడిపి, కాంగ్రెస్ ఎంపీలు ఎవరన్నారు.

సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారని, బిజెపిపై బురద చల్లుతున్నారని యెండల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తెలంగాణ పోరాటానికి సుష్మా అండగా ఉన్నారని చెప్పారు. యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె చేసిన ప్రసంగం, సోమవారం ప్రసంగాన్ని చూసి ఆమెపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని జాతీయ రాజకీయ అంటరానివాడిగా ప్రకటించాలని సిద్దిపేట ఎమ్మెల్యే, తెరాస నేత హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రకే సిఎం అని తెలంగాణ మంత్రులు చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+