బాబు బొమ్మ: దత్తాత్రేయ రథంపై కిషన్ బొమ్మ మిస్

అయితే, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫొటో మాత్రం కనిపించలేదు. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ కోసం కిషన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అదే స్థాయిలో దత్తాత్రేయ ప్రయత్నించి టికెట్ సాధించుకున్నారు. ఒక దశలో వీరిద్దరూ తీవ్ర వాగ్వాదానికి కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఫొటోను దత్తాత్రేయ పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కిషన్‌రెడ్డికి, పార్టీ సీనియర్లకూ మధ్య కొన్నాళ్లుగా దూరం పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి అగ్రనేత వెంకయ్యనాయుడు కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి సీనియర్లను ఎదిరించారు. దీంతో ఆయనను పక్కన పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
దానికితోడు, తెలుగుదేశం పార్టీతో పొత్తును జి. కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. సీనియర్లు మాత్రం పొత్తుకు ప్రయత్నాలు చేశారు. దీనివల్ల కూడా సీనియర్ నేతలతో కిషన్ రెడ్డికి దూరం పెరిగిందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా ఆయన అలక వహించారు.












Click it and Unblock the Notifications