బాబును కల్సిన కిషన్ రెడ్డి: మల్కాజిగిరిపై ప్రతిపాదన

కాగా, పొత్తులో భాగంగా బిజెపికి దక్కిన మల్కాజిగిరి శాసన సభ స్థానం విషయంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మల్కాజిగిరి స్థానాన్ని టిడిపి తీసుకొని.. బదులుగా ఎల్బీనగర్, మేడ్చల్ ఇవ్వాలని బిజెపి టిడిపిని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి టిడిపి అంగీకరించలేదని సమాచారం.
చంద్రబాబును కలిసిన సమయంలోను మల్కాజిగిరి సీటు మార్పిడిపై కిషన్ రెడ్డి ప్రస్తావించిట్లుగా తెలుస్తోంది. ఎల్బీనగర్, మేడ్చల్ స్థానాలను బిజెపి నేతలు వంగా మధుసూదన్ రెడ్డి, కొంపల్లి మోహన్ రెడ్డిలు ఆశిస్తున్నారు. మరోవైపు మల్కాజిగిరి స్థానం నుండి మారేందురు బిజెపి నేత రామచంద్ర రావు కూడా ససేమీరా అంటున్నారు.
బాబు దిష్టి బొమ్మ దగ్ధంపై బిజెపి నేతలు
బిజెపి కార్యాలయం ముందు సోమవారం పలువురు ఆశావహులు, వారి అనుచరులు చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్ధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి నాయకులు కొందరు స్పందించారు. బాబు బొమ్మను దగ్ధం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి టిడిపితో కలిసి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications