వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి పొత్తు: కిషన్ రెడ్డి బలయ్యారా, వెంకయ్య దూరం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి బలి పశువు అయ్యారా? బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో ఆయనకు చెడిందా? అంటే అవుననే అంటున్నారు.

టిడిపితో పొత్తును కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంత నేతలు మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంకయ్య నాయుడు మాత్రం పొత్తు కోసం ప్రయత్నాలు చేశారంటున్నారు. టిడిపితో పొత్తు కారణంగా తెలంగాణలో బిజెపి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కిషన్ రెడ్డి, ఇతర తెలంగాణ నేతలు భావిస్తున్నారు.

అయినప్పటికీ బిజెపి అధిష్టానం మాత్రం పొత్తులపై కిషన్ రెడ్డి మాటను పెడ చెవిన పెట్టింది. అధిష్టానం వైఖరిపై కిషన్ రెడ్డి అలక వహించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే తాను రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారని అంటున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినప్పటికీ అధిష్టానం అడగక పోవడం ఆయనను బాధించిందంటున్నారు.

Kishan Reddy unhappy with High Command

కిషన్ రెడ్డి, తెలంగాణ నేతలు ఎంత చెప్పినా టిడిపితో పొత్తుపై అధిష్టానం ముందుకే వెళ్లిందంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు కిషన్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అలాంటి కిషన్ రెడ్డి మాటను పట్టించుకోకుండా రాజకీయంగా ఆయనను ఏకాకి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

టిడిపితో పొత్తు కంటే ఒంటరి పోరు చాలా మంచిదని, ఇప్పుడు అధికారంలోకి రాకపోయినా ఎక్కువ సీట్లను గెలుచుకుంటామని, 2019లో బిజెపి కచ్చితంగా అధికారంలోకి రాగలిగే సీట్లు కైవసం చేసుకుంటుందని తెలంగాణ బిజెపి నేతలు బలంగా భావించారు. ఇప్పుడు టిడిపితో పొత్తు కారణంగా అది బెడిసి కొట్టిందంటున్నారు.

అధిష్టానం వైఖరిపై కిషన్ అలక, ఓంటరి, వాదనను పట్టించుకోని బిజెపి, ఎన్నికల్లో పోటీ చేయనన్నా పట్టించుకోలేదు, ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినా అడగలేదట, మనస్తాపం కలిగించాయి, సమర్థుడైన పోత్తులో బలి పశువుగా కిషన్
రాజకీయంగా ఏకాకిని చేసింది, ఓంటరి పోరు బెట్టర్ అని పదే పదే చెప్పారు, ఏకీభవించలేదు,

వెంకయ్యతో విభేదాలు

కిషన్ రెడ్డి బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడికి మంచి అనుచరుడిగా చెబుతారు. అయితే, విభజన నేపథ్యంలో వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయంటున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి అంబరుపేట నుండి పోటీ చేస్తే... పొత్తుకు అడ్డుపడ్డారన్న కారణంతో ఓడించే కుట్ర జరుగుతోందంటున్నారు.

English summary
BJP Telangana chief Kishan Reddy unhappy with High Command's alliance decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X