హైదరాబాద్‌లో బతకలేం: షిండేకు కిశోర్ చంద్రదేవ్ లేఖ

తెలంగాణ విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిన నేపథ్యంలో కిశోర్ చంద్రదేవ్ ఈ లేఖ రాశారు. హైదరాబాద్‌లో తెలంగాణేతరుల ఆస్తులకు భద్రత కల్పించాలని కూడా ఆయన కోరారు. హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న తెలంగాణావారు తెలంగాణేతరులను ఇవన్నీ మావి, మీరు సీమాంధ్రకు వెళ్లిపోతే ఇవన్నీ మావేనంటున్నారని, ఇటువంటి పరిస్థితులలో రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నదనీ కిశోర్ వివరించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో స్థిర పడిన సీమాంధ్రులలో రోజురోజుకీ భయాందోళనలు పెరుగుతున్నాయని, వారి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందనీ, అందువల్ల వారి భద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. విభజన అనంతరం విశాఖపట్నాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు.
సీమాంధ్రకు చెందిన మరో కేంద్ర మంత్రి చిరంజీవి - హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే సీమాంధ్ర ప్రజల్లోని ఆందోళన సద్దమణుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications