అలా చెబితే సిగ్గేస్తోంది: కెకె, రిమోట్ మీ వద్దే: నాయిని
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్క విద్యార్థికి బెయిల్ ఇప్పించలేని కాంగ్రెసు పార్టీ నేతలు ఇప్పుడు తామే తెలంగాణను తెచ్చామంటే సిగ్గేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు బుధవారం అన్నారు. కాంగ్రెసు వస్తే తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందో లేక ఆంధ్ర ప్రజలకు అండగా ఉంటుందో తేల్చుకోవాలన్నారు.
తెలంగాణను ఎవరిచ్చారో, ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసునని చెప్పారు. అసలు సిసలైన ఉద్యమం ఇప్పుడే ప్రారంభమవుతుందన్నారు. పదమూడేళ్ల తెలంగాణ ఉద్యమం కంటే రానున్న ఐదేళ్లు పరీక్షా సమయం అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం జరిగే వరకు తెరాస ఉద్యమం ఆగదన్నారు.

ఉద్యోగులకు ఆప్షన్ దారుణమన్నారు. ఉద్యోగాల్లో తెలంగాణ వాటాలో అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ సమస్యల పైన పోరాడే వ్యక్తి కెసిఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఇంకా మిగిలే ఉంటాయని చెప్పారు.
కాంగ్రెసు పార్టీకి అధికారం ఇస్తే రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉంటుందని, అదే తెరాసకు ఇస్తే ప్రజల చేతుల్లో ఉంటుందని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెరాసకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని కోరారు. తెరాసతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. కెసిఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పారు.
ఆంధ్రా పార్టీలకు అమ్ముడు పోతుంది: యాష్కీ
తెరాసపై కాంగ్రెస్ లోకసభ సభ్యుడు మధుయాష్కీ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఎలాంటి గడ్డి తినడానికైనా తెరాస సిద్ధంగా ఉందన్నారు.ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రా పార్టీలకు అమ్ముడు పోతుందని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులైన కొండా దంపతులను చేర్చుకున్న తెరాస... అమరవీరుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతుందన్నారు.తెలంగాణ పునర్నిర్మాణమంటే దొరలు, గడీల రాజ్యం కాదన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications