TTD: తిరుమల లడ్డూలకు జంతు కొవ్వు, నందిని నెయ్యి క్లారిటీ, జగన్ దెబ్బ
కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు వెళ్లి శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హిందువు ఆశపడుతుంటారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వీలైనన్ని తిరుమల లడ్డూలు తీసుకోవాలని భక్తులు పోటీ పడుతుంటారు. దేశ విదేశాల్లో కూడా ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూకి చాలా ప్రధానత్య ఉంది. అంత పవిత్రమైన తిరుమల లడ్డు చిక్కితే చాలని శ్రీవారి భక్తులు అంటుంటారు.
అంతటి పవిత్రమైన తిరుమల లడ్డూలను అపవిత్రం చేశారని వెలుగు చూడడం కలకలం రేపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలను అపవిత్రం చేశారని, జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూలు తయారు చేశారని వెలుగు చూడడం కలకలం రేపుతోంది. తిరుమల లడ్డూలను జంతువుల కొవ్వుతో తయారు చేశారని గుజరాత్ కి చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్ డీడీబీ) కాఫ్ సంస్థ అనుమానం వ్యక్తం చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహా ప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి కలిపారని ఎన్ డీడీబీ అనుమానాలు వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలకు లడ్డూలు తయారు చేయడానికి తాము నందిని నెయ్యి సరఫరా చేయలేదని కర్ణాటకకు చెందిన నందిని( కెఎమ్ఎఫ్) స్పష్టం చేసింది. గత 50 సంవత్సరాలకు పైగా తిరుమల లడ్డూలు తయారు చేయడానికి నందిని నెయ్యిని సరఫరా చేసేవారు.
తిరుమల లడ్డూలలో గొడ్డు కొవ్వు కలిపారని ఆరోపణలు కావడంతో కేఎంఎఫ్ స్పందించింది. జగన్ సీఎం అయిన తర్వాత వైసీపీ నాయకుడు, జగన్ చిన్నాన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో టీటీడీ నిర్ణయించిన ధరలకు నెయ్యి సరఫరా చేయలేమని కేఎమ్ఎఫ్ కి చెందిన యాజమాన్యం స్పష్టం చేసింది. ఆ సందర్భంలో ఎంతో రుచికరమైన నందిని నెయ్యి సరఫరాను అప్పటి టీటీడీ యాజమాన్యం నిలిపివేసింది. తిరుమల లడ్డూలు తయారు చెయ్యడానికి నందిని నెయ్యిని నిలిపివేయడంతో పెద్ద దూమరం చెలరేగింది.

అయితే ఆ విషయంపై అప్పటి జగన్ ప్రభుత్వం గానీ, అప్పటి టీటీడీ చైర్మన్ గాని ఏ మంత్రం పట్టించుకోలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. టీటీడీ నిర్ణయించిన ధరలకు తాము గత నాలుగు సంవత్సరాలుగా నందిని నెయ్యిని తిరుమలకు సరఫరా చేయలేదని కేఎమ్ఎఫ్ స్పష్టం చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అప్పట్లో తిరుమల లడ్డూల తయారికి నందిని నెయ్యిని సరఫరా చెయ్యడం నిలిపివేశామనే విషయంలో క్లారిటీ ఇచ్చారు.
ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూలు తయారు చేయడానికి నందిని నెయ్యిని పక్కన పెట్టి ఇతర సంస్థలకు ఆ టెండర్లు అప్పగించడంతో తిరుమల లడ్డూల రుచి, నాణ్యత కూడా తగ్గిపోయిందని గత నాలుగు సంవత్సరాలు నుండి తిరుమల భక్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంత పవిత్రమైన తిరుమల లడ్డూల తయారి కోసం గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాడారని గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ ఒక నివేదిక ఇవ్వడం కలకలం రేపుతుంది. తిరుమల లడ్డుల తయారి విషయంలో ఈ విషయం వెలుగు చూడటంతో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా దూమరం రేపుతోంది.












Click it and Unblock the Notifications