జనరల్ కోచ్ లో ఖాళీ లేకపోతే రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణించవచ్చా..?
దేశానికి భారతీయ రైల్వే జీవనాడి. తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం వల్ల చాలామంది మొదటి ప్రాధాన్యత కింద రైలు ప్రయాణానికే ఓటేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర ప్రయాణ సాధనాలవైపు దృష్టిసారిస్తారు. రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం కోసం మూడునెలలు, రెండు నెలలు ముందుగా కూడా టికెట్లు బుక్ చేసుకుంటారు. అనేకసార్లు అత్యవసర ప్రయాణం ఏర్పడి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారు.
నిలబడలేనంత రద్దీగా ఉంటే..:తత్కాల్ లో టికెట్ లభించనప్పుడు సాధారణ కంపార్ట్ మెంట్ లో ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ అది చాలా రష్ గా ఉండి నిలబడటానికి కూడా స్థలం లేనంత రద్దీగా ఉంటుంది. ఆ రద్దీని తట్టుకోలేక రిజర్వేషన్ బోగీలోకి ఎక్కుతాం. రైల్వే చట్టం 1989 ప్రకారం మీ ప్రయాణం 199 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ అయితే జనరల్ కంపార్ట్‌మెంట్ టికెట్ 3 గంటలపాటు చెల్లుబాటు అవుతుంది. దూరం ఎక్కువైతే వ్యాలిడిటీ 24 గంటలకు పెరుగుతుంది. ఆ మార్గంలో మరో 3 గంటలపాటు ఎటువంటి రైలు అందుబాటులో లేకపోతే ఆ రైలులో స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేయవచ్చు.

టీటీఈకి వివరణ ఇవ్వాలి:రిజర్వేషన్ బోగీలోకి వచ్చిన తర్వాత టీటీఈ కి మనం ఏ కారణం చేత బోగీలోకి రావల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి. స్లీపర్ క్లాస్ లో ఏదైనా సీటు ఖాళీగా ఉంటే సరిపడా డబ్బులు తీసుకొని మీకు టికెట్ ఇస్తారు. ఖాళీ లేకపోతే తర్వాత వచ్చే స్టేషన్ వరకు టీటీఈ అనుమతించవచ్చు. తర్వాత బయటకు వెళ్లకపోతే రూ.250 జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించడానికి డబ్బులు లేకపోతే చలాన్ చేస్తాడు. దాన్ని కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. టీటీఈ కానీ, పోలీసులు కానీ స్లీపర్ క్లాస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోను బయటకు వెళ్లమని చెప్పరు. అలాగే మీ లగేజీని కూడా జప్తు చేయలేరు. జరిమానా మాత్రమే విధిస్తారు. దీన్ని చెల్లించడంద్వారా సీటు లేకుండా స్లీపర్ లో ప్రయాణిస్తారు.












Click it and Unblock the Notifications