ఎన్టీఆర్‌కి భారతరత్న: జగన్‌పార్టీ నేత, ఏడాదిలో: ప్రసన్న

విజయవాడ/హైదరాబాద్: ఊపిరి ఉన్నంత వరకు తాను ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిల ఆశయాల సాధనకు పాటుపడతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొడాలి నాని బుధవారం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందజేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్‌తోనే

తాను చచ్చేంత వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని కడప జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి అన్నారు. నారాయణ స్వామి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు.

Kodali Nani demands Bharat Ratna for NTR

తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టి జగన్ కాళల్కు తొడిగినా రుణం తీరదన్నారు. తాను పదవుల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రాలేదన్నారు. తాను చచ్చేంత వరకు జగన్‌తోనే ఉంటానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు చేశారన్నారు.

ఏడాదిలో గల్లంతు

టిడిపి ఏడాదిలోపే అధికారం కోల్పోవడం ఖాయమని కొవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. 2015 ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరులోపు టిడిపి ప్రభుత్వం పతనం ఖాయమన్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవి నెరవేర్చలేరన్నారు. చంద్రబాబుకు ఓటేసినందుకు ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోవడంతో ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేస్తారని జోస్యం చెప్పారు. మధ్యంతర ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+