ఆయ‌న‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను: కొడాలి నాని

తెలుగుదేశం పార్టీపై తనకు ఏమాత్రం అభిమానం లేదని, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. హరికృష్ణ తనను రాజకీయాల్లోకి తీసుకొస్తే, జూనియ‌ర్ త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని చెప్పారు. అమరావతి రైతుల ముసుగులో తారక్‌ను అదేప‌నిగా తిట్టిస్తున్నారని కొడాలి మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆడుతున్న నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నిక‌ల్లోవారిద్ద‌రికీ గుణ‌పాఠం త‌ప్ప‌ద‌న్నారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట పాద‌యాత్ర‌లు చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.

kodali nani fire on chandrababu

చంద్రబాబుకు రాజకీయంగా జీవితాన్ని ప్ర‌సాదించింది ఎన్టీ రామారావు అని.. అలాంటి ఎన్టీఆర్‌నే మోసం చేసిన చరిత్ర ఆయ‌న‌ద‌ని కొడాలి నాని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబుకు శ్వాసం లేదని, అత‌న్ని నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పని పేర్కొన్నారు. తనకు మాత్రం ఎన్టీఆర్ కుటుంబంపై విశ్వాసముందని, కేవలం తోడు కోసమే లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారని.. ఆమెకు ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదనే విష‌యాన్ని కొడాలి గుర్తుచేశారు. విశాఖ‌ప‌ట్నంలో భూ కుంభ‌కోణం జ‌రిగిందంటూ ఎల్లో మీడియా దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని, రుషికొండ‌ను త‌వ్వేస్తున్నారంటూ గ‌గ్గోలు పెడుతున్నార‌ని, రుషికొండ‌లోది ప్ర‌భుత్వ స్థ‌ల‌మ‌ని, అక్క‌డ నిర్మించేది కూడా ప్ర‌భుత్వ కార్యాల‌య‌మేన‌ని, అందులో కుంభ‌కోణం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. కొండలు తవ్వి హైదరాబాద్ లోవ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇళ్లు కట్టుకోలేదా? అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+