• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు, దేవినేని ఉమ లుచ్చాలు.. అమ్మ మొగుడు అంటూ కొడాలి నాని ఫైర్

|

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నాని భగ్గుమన్నారు. చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలపై బూతుపురాణం వల్లించారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని ధ్వజమెత్తుతూ..

 దేవినేని ఉమపై తీవ్ర పదజాలంతో

దేవినేని ఉమపై తీవ్ర పదజాలంతో

సన్న బియ్యం ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్టు దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. సన్న బియ్యం ఇస్తానని వైఎస్ జగన్ నీ అమ్మ మొగుడికి ఇస్తానని చెప్పాడా అని ధ్వజమెత్తారు. మేము నాసిరకం బియ్యం ఇస్తానని చెప్పామని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నాసిరకం బియ్యం ఇస్తామని అన్నారు. మీ నాయకుడు చంద్రబాబు సన్నబియ్యం ఇవ్వలేదని కొడాలి నాని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు గుడ్డి గుర్రం పళ్లు తోమాడా? అని అన్నారు.

వదినను చంపి రాజకీయాల్లోకి

వదినను చంపి రాజకీయాల్లోకి

దేవినేని ఉమ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అన్న చస్తే ఉమ రాజకీయాల్లోకి వచ్చారు. వదిన అడ్డం పడుతుందని, ఆమెను చంపిన లుచ్చాగాడు ఆయన. అలాంటి వ్యక్తి విమర్శలు చేసే నీతులు చెబుతాడా? అని అన్నారు. ఇక చంద్రబాబు కాంగ్రెస్‌లో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఆ పార్టీకి పంగనామాలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను ఓడిస్తానని విమర్శించిన చంద్రబాబు.. చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఇలాంటి ఇద్దరు లుచ్చాలు నా గురించి మాట్లాడుతారా? వాళ్లిద్దరూ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఉమను హెచ్చరించారు.

దేవినేని నెహ్రూ గురించి

దేవినేని నెహ్రూ గురించి

దేవినేని అవినాష్ విషయంలో క్లారిటీ ఇస్తానని కోడాలి నాని చెబుతూ.. ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించినా ఆయన బతికి ఉన్నంతకాలంతో అతడితోనే ఉన్న నేత దేవినేని నెహ్రూ చివరి వరకు తెలుగుదేశంలోనే కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. చివరకు ఆరోగ్యం బాగా లేకపోయిన సమయంలో తన కుమారుడు అవినాష్‌ను చంద్రబాబు చేతిలో పెట్టారు. అలాంటి అవినాష్‌ను చిన్నచూపు చూశారు. అందుకే వైసీపీలో చేరారని అన్నారు.

సుజానా, సీఎం రమేష్‌ను ఎందుకు ప్రశ్నించలేదు

సుజానా, సీఎం రమేష్‌ను ఎందుకు ప్రశ్నించలేదు

దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. వల్లభనేని వంశీ ఇంకా చేరలేదు. అలాంటి సమయంలో నలుగురు, ఐదుగురు టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. అదే సుజానా చౌదరీ, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ లాంటి నేతలు బీజేపీలో చేరితే ఈ టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టలేదు. వారిని ఏ ఒక్కడు ఎందుకు ప్రశ్నించలేదు. వారిని తిడితే కేసు పెడుతారని నోర్ముసు కూర్చున్నారు అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా దేవినేని ఉమ ఎక్కడకి రావాలిరా.. చూసుకొందామా అని తీవ్ర పదజాలంతో దూషించారు.

నోరు అదుపులో పెట్టుకో

నోరు అదుపులో పెట్టుకో

ఉమా తనను బెదిరిస్తున్నాడని..ఎక్కడకు రమ్మంటావో చెప్పు..పిచ్చ మాటలు మాట్లాడవద్దంటూ ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ మంత్రిగా ఉమా ఎంత దోచుకున్నాడో అందరికీ తెలుసంటూ మరోసారి పరుష పదజాలంలో విరుచుకుపడ్డారు. ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని తన గురించి..ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేసారు.

బీజేపీ రహస్యంగా మంతనాలు

బీజేపీ రహస్యంగా మంతనాలు

టీడీపీలో ఉంటూ బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల గురించి చంద్రబాబు..ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఎందుకు స్పందించని నాని ప్రశ్నించారు. మాట్లాడితే బీజేపీ నేతలు వారిని గుడ్డలు విప్పి.. లోపల వేస్తారనే భయం ఉందన్నారు. వారి మీద చర్యలు తీసుకొనే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. వారిని బీజేపీలోకి పంపించి..వారితో రహస్యంగా పోన్ మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ..పవన్ మతం..కులం..ఇంగ్లీషు..ఇసుక వంటి వాటివి తప్పితే జగన్ మీద మాట్లాడటానికి వారికి ఇక ఏమీ లేదని ఫైర్ అయ్యారు. అయితే, కొడాలి నాని వాడిన పరుష పదజాలం మీద టీడీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

English summary
YSRCP leader, AP minister Kodali Nani fires on Chandra Babu, Devineni Uma. He uses abusive language over Vallabhaneni Vamshi and Devineni Avinash Issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X