Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

90 వేల కోట్ల నిధులు ఏమయ్యాయి.. చంద్రబాబు అమ్మ మొగుడా..? కొడాలి నాని హాట్ కామెంట్స్ (వీడియో)

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తోండగా.. నాని ఫైరయ్యారు. అమరావతి రాజధాని కోసం గత హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు. గ్రాఫిక్స్‌తో కాలం వెళ్లదీశారే తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. మీకు అమరావతి 29 గ్రామాల ప్రజలే సీఎం, ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారా.. విశాఖపట్టణం, కర్నూలు ప్రజలు ఎన్నుకోలేదా అని ప్రశ్నించారు.

రూ.90 వేల కోట్లు ఏవీ..?

రూ.90 వేల కోట్లు ఏవీ..?

అమరావతి రాజధాని కోసం లక్ష కోట్ల డీపీఆర్ సిద్ధం చేసి రూ.10 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాని గుర్తుచేశారు. మరి 90 వేల కోట్ల ఏమయ్యాయని అడిగారు. మిగతా డబ్బులతో నిర్మాణ పనులు చంద్రబాబు అమ్మ మొగుడు పనులు చేయిస్తాడా లేదంటే ఉమా అమ్మ మొగుడు పనులు చేయిస్తాడా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రూ.10 వేల కోట్లతో

10 వేల కోట్లతో తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించాడన్నారు. 175 ఎమ్మెల్యేల క్వార్టర్లు, 100 ఐఏఎస్, ఐపీఎస్ కార్యాలయాలను మాత్రమే నిర్మించి చేతులు దులుపుకున్నారని ఫైరయ్యారు. కానీ అంతా చేసేశామని కోతలు మాత్రం కోస్తున్నారని విరుచుకుపడ్డారు.

అంతా గ్రాఫిక్స్ మాయ..

అంతా గ్రాఫిక్స్ మాయ..

అమరావతి రాజధాని గ్రాఫిక్స్ వేసి చూపించారని కొడాలి నాని మండిపడ్డారు. రోడ్లు, రైల్వే లైన్లు ఆఖరికి ఫుట్ పాత్ కూడా గ్రాఫిక్స్ మాయే అన్నారు. అదీ గ్రాఫిక్స్ కాదు అని వారు ఎవరో చెప్పాలని.. చంద్రబాబు వేసిన రోడ్డుపై 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని సవాల్ విసిరారు. అప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదిలిపోతుందని చెప్పారు.

Recommended Video

    Amit Shah Tests Coronavirus Positive ఆస్పత్రిలో చేరుతున్నా అని అమిత్ షా ట్వీట్ ! || Oneindia Telugu
     మానవత్వం లేదు..

    మానవత్వం లేదు..

    చంద్రబాబుకు కనీసం మానవత్వం కూడా లేదని నాని విరుచుకపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ది చెందొద్దా అని ప్రశ్నించారు. ఎందుకింత కంటగింపు అని తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు నిష్ట దరిద్రుడు, గబ్బిలం, జలగ, జూమ్ నాయుడు అని తిట్టిపోశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+