వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానీ దిష్టిబొమ్మ దగ్ధం ... నానీ హిందువైనా డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఫైర్

|
Google Oneindia TeluguNews

తిరుమల డిక్లరేషన్ వివాదంపై ఏపీలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి వారిని దర్శించుకోవాలని కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తిరుమల డిక్లరేషన్ వివాదంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలకు, ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే .. ప్రతిపక్షాల డిమాండ్ .. చిత్తూరు జిల్లాలో హై అలెర్ట్సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే .. ప్రతిపక్షాల డిమాండ్ .. చిత్తూరు జిల్లాలో హై అలెర్ట్

 తిరుమలకు వెళ్ళిన కొడాలి నానీ ... ఏపీలో పెద్ద చర్చ

తిరుమలకు వెళ్ళిన కొడాలి నానీ ... ఏపీలో పెద్ద చర్చ

ఇప్పటికే హిందూ సంఘాలు బిజెపి, టిడిపి నాయకులు కొడాలి నాని క్షమాపణ చెప్పాలని, బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు .అంతేకాదు హిందువుల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్న వేళ తగుదునమ్మా అంటూ కొడాలి నాని తిరుమలకి వెళ్లారు. అసలే తిరుమలలో నాని వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమంటుంటే ఆయన తిరుమలకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని వైసీపీ నేతలు చూస్తున్నారన్న చంద్రబాబు

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని వైసీపీ నేతలు చూస్తున్నారన్న చంద్రబాబు


తాజాగా తిరుమల డిక్లరేషన్ వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అన్య మతస్థుడు అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో తాజా పరిస్థితిపై పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు , జగన్ డిక్లరేషన్ ఇచ్చేవరకు పట్టుబట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు . బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు ఇస్తే రాష్ట్రానికి అరిష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని కొడాలి నానీ వంటి వైసీపీ నేతలు చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు .ఇక దీనిపై రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

కొడాలి నానీ హిందువైనా సరే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన స్వామీ పరిపూర్ణానంద

కొడాలి నానీ హిందువైనా సరే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన స్వామీ పరిపూర్ణానంద

కొడాలి నాని హిందువు అయినప్పటికీ, ఆయన తల్లిదండ్రులు హిందువులు అయినప్పటికీ డిక్లరేషన్ పై సంతకం పెట్టి మరీ ఆలయంలోకి వెళ్లాలని పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు . కొడాలి నానీకి తన మతం పై నమ్మకం లేదని, హిందూ దేవతల విగ్రహాలను ప్రాణం లేని వస్తువులతో పోల్చారని స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు.
ఇక ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను కృష్ణా జిల్లా నందిగామ లో టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి.

Recommended Video

#Watch AP CM YS Jagan's Lotus Pond ముట్టడి, Bajrang Dal Activists నిరసనలు....!! || Oneindia Telugu
కొడాలి నానీ దిష్టిబొమ్మ దగ్ధం .. కొనసాగుతున్న ఆందోళనలు

కొడాలి నానీ దిష్టిబొమ్మ దగ్ధం .. కొనసాగుతున్న ఆందోళనలు

కొడాలి నాని ఆలయాలపై, దేవతా విగ్రహాలపై, తిరుమల డిక్లరేషన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిడిపి నేతలు నందిగామ రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయం ఎదుట నిరసన దీక్షలు కొనసాగించారు. తిరుమలలో తాజా పరిణామాలతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవాలని అటు టీడీపీ,ఇటు బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్ట్ లు కొనసాగాయి. మీడియాకు సైతం ఆంక్షలు విధించడంతో తిరుమలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

English summary
Although Kodali Nani was a Hindu, Paripurnananda Swamy demanded that he go to the temple and sign the declaration. YCP leaders are turning the state into a fireball, Chandrababu said. Kodali nani's effigy burnt by TDP activists in Nandigama, Krishna district. Tension is high in Thirumala with the latest developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X