చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు; బాయ్ కాట్ హైడ్రామా.. సింపతీ అస్త్రం: వదిలిపెట్టని కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగిన అవమానంపై చంద్రబాబు కంటతడి పెట్టుకున్న తరువాత మాట్లాడిన కొడాలి నాని అప్పుడు కూడా విడిచిపెట్టకుండా చంద్రబాబుపై మాటల దాడికి దిగారు. చంద్రబాబు చేసేవన్నీ డ్రామాలంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు గ్లిజరిన్ రాసుకుని ఏడ్చాడని, గ్లిజరిన్ సరిగా రాసుకోకపోవడం వల్ల ఆయనకు కన్నీళ్లు సరిగా రాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయ్ కాట్ ఒక హైడ్రామా

అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయ్ కాట్ ఒక హైడ్రామా

అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయ్ కాట్ ఒక హైడ్రామా అంటూ పేర్కొన్న కొడాలి నాని మరోమారు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేని తన భార్య భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత ఆవేదన అనుభవించ లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు ఏడుపును కూడా ఎద్దేవా చేసిన కొడాలి నాని అసెంబ్లీ వేదికగానే తీవ్ర వ్యాఖ్యలు చేసి చంద్రబాబును టార్గెట్ చేశారు.

ఇదంతా ముందస్తు చంద్రబాబు వ్యూహంలో భాగం

వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలను చంద్రబాబే చేశాడని బయట మాట్లాడుకుంటున్నారని పేర్కొన్న ఆయన, ఆ హత్యల గురించి సభలో చర్చించాలని పేర్కొన్నారు. అన్ని విషయాలపై చర్చించాలని తాము చెబితే తన భార్య గురించి మాట్లాడారంటూ చంద్రబాబు సింపతీ కార్డులు తీశాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇదంతా ముందస్తు చంద్రబాబు వ్యూహంలో భాగం అన్న కొడాలి నాని, ఇకపై అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలన్న దానిపై గురువారం సాయంత్రమే పార్టీ నేతలతో చర్చించి ఓ ప్లాన్ చేశారని, ఆ ప్లాన్ ను శుక్రవారం నాడు అమలు చేశారని పేర్కొన్నారు.

చంద్రబాబు మంగమ్మ శపధాలను ఎవరూ నమ్మరు

ఇక చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడిన కొడాలి నాని చంద్రబాబు మంగమ్మ శపధాలను ఎవరూ నమ్మరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీ ని బాయ్ కట్ చేస్తారని తాను మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుకుంటున్నామని, చంద్రబాబు అసెంబ్లీకి రారని బొత్సా తనకు చెప్పారని పేర్కొన్న కొడాలి నాని ఇంతలోనే పక్కా ప్లాన్ ను అమలు చేసి సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ మొసలికన్నీరు కారుస్తూ అసెంబ్లీని బాయ్ కట్ చేసి చంద్రబాబు వెళ్లిపోయారని పేర్కొన్నారు.

రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు

రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు

అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనతోనే ఈ డ్రామా మొదలుపెట్టారు అన్న మంత్రి కొడాలి నాని రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం చంద్రబాబుది అని పేర్కొన్నారు . చంద్రబాబు పదవి కోసం కుటుంబ సభ్యులను కూడా పట్టించుకునే వ్యక్తి కాదని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు పని అయిపోయిందని పేర్కొన్న కొడాలి నాని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక అస్త్రం సింపతి అని, దానికోసం చంద్రబాబు చేయాల్సినవన్నీ చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మేది లేదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+