లుకౌట్ నోటీసుల వేళ కొడాలి నాని ప్రత్యక్షం - ఇక నెక్స్ట్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతోంది. ఇదే సమయంలో గత వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ఆ పార్టీ ముఖ్య నేతల పైన కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం సాగుతోంది. వల్లభనేని వంశీ జైలులో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని పైన తాజాగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా.. ఆయన ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి.
మాజీ మంత్రి కొడాలి నాని ఈ మధ్య కాలంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సమస్యలతో బాధ పడుతున్న నానికి ముంబాయిలో బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తరువాత నాని క్రమేణా కోలుకుంటున్నారు. ముంబాయి ఆస్పత్రిలోనే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న నాని.. ఆ తరువాత హైదరాబాద్ లో ఉంటున్నారు. కాగా, నాని త్వరలో అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని.. అక్కడే మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి తీసుకోవటానికి సిద్దమైనట్లు ప్రచారం సాగింది. దీంతో, తాజా గా నాని పైన నమోదైన కేసుల కారణంగా లుకౌట్ నోటీసులు జారీ చేసారు. నాని విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా ఈ నోటీసులు జారీ అయ్యాయి.

కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ముఖ్య నేతల పైన అనుచిత వ్యాఖ్య లు చేసారు. ఆయన పైన పలు కేసులు నమోదయ్యాయి. కాగా, నాని న్యాయస్థానం ఆశ్రయించారు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఉండటం తో నాని అరెస్ట్ జరగలేదు. ఇక, నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయిన తరువాత అనూహ్యంగా కొడాలి నాని హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కుంకుమాస్ సంధ్య కన్వెన్షన్ ప్రత్యక్షమయ్యారు. వివాహ రిసిప్షెన్ కు నాని హాజరైనట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లుకౌట్ నోటీసులు జారీ అయిన సమయంలోనే నాని ఈ వేడుకలో పాల్గొన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే.. నాని ఇంకా పూర్తిగా ఆరోగ్య సమస్య ల నుంచి బయట పడలేదని.. క్రమేణా కోలుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు కొడాలి నాని కేసుల విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications