కొడాలికి మంచి నామినేటెడ్ పోస్ట్.. మరీ ఫైర్ బ్రాండ్ ఏమంటారో..?
ఏపీలో జగన్ మంత్రివర్గం ఖరారు అయ్యింది. పదవీ ఆశించి.. భంగపడిన వారికి నామినెటెడ్ పదవులను ఇస్తున్నారు. అందులో ముందువరసలో ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఉన్నారు. వాస్తవానికి ఆయనకు రెండో టర్మ్ కూడా పదవీ ఖాయం అనే చర్చ జరిగింది. కానీ చివరి క్షణంలో మార్పు జరిగింది. రోజా పేరు తెరపైకి రావడంతో.. నానిని పక్కన బెట్టాల్సి వచ్చింది. కానీ ఆయనకు మంచి నామినెటెడ్ పదవీని సీఎం జగన్ ఇస్తున్నారు.

కొడాలికి నామినేటెడ్ పదవీ
ఏపీలో పలువురు మంత్రి పదవులు నిలుపుకోగా, పలువురికి నిరాశ తప్పలేదు. కొడాలి నానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించనుంది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ గా కొడాలి నానిని నియమించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు లేదు. నానికి కీలక పదవీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. అతను కూడా కీలక నేత కావడంతో మంచి పదవీ ఆఫర్ చేశారు. ఇదీ క్యాబినెట్ హోదా ఉంటుంది. త్వరలోనే బోర్డును ఏర్పాటు చేసి, చైర్మన్‌గా కొడాలి నానికి బాధ్యతలు అప్పగిస్తారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు పేరు ఖరారైందని తెలుస్తోంది.

జగన్ సాహసమే చేశారు..
కొడాలి నాని కీలక నేత.. ప్రతిపక్షాలను ముఖ్యంగా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసే నేత.. ఆయనను పక్కనబెట్టి సీఎం జగన్ సాహసమే చేశారు. అందుకోసమే మంచి నామినెటెడ్ పదవీ ఇచ్చారు. మరీ దీనిపై కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలీ.. క్యాబినెట్ ర్యాంక్ గల పదవీపై సానుకూలంగా ఉంటారో.. లేదంటే అసహనంతో ఉంటారో చూడాలీ. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 25 మందిని సామాజిక సమీకరణాలు.. సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు.

25 మంది వీరే..
శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరకు చోటు లభించింది. విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు అవకాశం లభించింది.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికేబినెట్‌లో తిరిగి చోటు లభించింది.
ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున కేబినెట్‌లో అవకాశం కలిగింది. విడదల రజనీ, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ బాషా.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీచరణ్, తిప్పేస్వామి మంత్రులుగా రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు.












Click it and Unblock the Notifications