గుడివాడలో నిమ్మకాయ నీళ్ళకు 28లక్షలు.. గడ్డం గ్యాంగ్, కేడీ జగన్ దోచేశారు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒకవైపు ప్రజా పాలనలో దూకుడుగా ముందుకు సాగుతూనే మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా గుడివాడలో నిమ్మకాయ నీళ్ళకు 28 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్కలు రాశారని, ప్రజల డబ్బులు కొట్టేశారని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
నిమ్మకాయ నీళ్ళకు 28 లక్షలు.. టార్గెట్ చేసిన మంత్రి లోకేష్
నిమ్మకాయ నీళ్ళకు 28 లక్షల రూపాయలు గుడివాడ గుట్కా కొడాలి నానితో కలిసి కొట్టేసిన కేడీ జగన్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభ అంటూ ఒక ఫేక్ సభ పెట్టి నిమ్మకాయ నీళ్లు సరఫరా అని 28 లక్షల రూపాయలు కొట్టేసారని లోకేష్ ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు.

ప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా జగన్
ఇక ఈ పోస్టులో దోపిడీకి హద్దు లేదా జగన్ అంటూ మండిపడిన లోకేష్, ప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గు లేదా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ళకు 28 లక్షలు దిగమింగేసావంటూ జగన్ ను టార్గెట్ చేశారు. వైసీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ళ ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసం అంటూ జనం సొమ్ము 28లక్షలు దోచేసారని టార్గెట్ చేశారు లోకేష్.
గడ్డం గ్యాంగ్ అంటూ కొడాలి నానీని టార్గెట్ చేసిన లోకేష్
ఆ టిట్కో ఇల్లు ఒక్కో పేదవారికి మంజూరు చేయడానికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు దండుకున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని నారా లోకేష్ ఆరోపించారు.
గుడివాడను గుల్ల చేసిన గడ్డం గ్యాంగ్
అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేసారని మంత్రి లోకేష్ టార్గెట్ చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసింది అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అంటూ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి జగన్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications