వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటీషోళ్ల గతే: పోలవరంపై కోదండరాం వార్నింగ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం తేల్చి చెప్పారు. ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని, అలాకాకుండా తెలంగాణ ఆదివాసీలను నీట ముంచి పోలవరాన్ని కట్టడాన్ని జెఎసి వ్యతిరేకిస్తుందని అన్నారు. గిరిజనుల జోలికొస్తే బ్రిటీష్ వారికి పట్టిన గతే కేంద్ర ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ గురువారం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.

జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జరిగిన మహా ధర్నాలో సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, భారతీయ జనతా పార్టీ నాయకులు అశోక్ యాదవ్, సిపిఎ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు సూర్యం, గోవర్దన్ తదితరులు మాట్లాడారు.

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తెచ్చే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో తెలంగాణ మరో రావణకాష్టం అవుతుందని హెచ్చరించారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోపోతే జులై 14న ఢిల్లీలో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. అలాగే ఎంతో అధ్యయనం చేశాకే జెఎసి పోలవరాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. అదేవిధంగా ముంపు గ్రామాలను ఏపిలో విలీనం చేయాలన్న చట్ట వ్యతిరేక ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహా ధర్నాలో పది జిల్లాల్లోని జెఎసి భాగస్వామ్య పక్షాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

మహాధర్నా

మహాధర్నా

పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ గురువారం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.

మహాధర్నా

మహాధర్నా

మహా ధర్నాలో సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, బిజెపి నేతలు అశోక్ యాదవ్, సిపిఎ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు సూర్యం, గోవర్దన్ పాల్గొని మాట్లాడారు.

మహాధర్నా

మహాధర్నా

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మహాధర్నా

మహాధర్నా

అప్రజాస్వామిక ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తెచ్చే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో తెలంగాణ మరో రావణకాష్టం అవుతుందని హెచ్చరించారు.

మహాధర్నా

మహాధర్నా

పోలవరం ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోపోతే జులై 14న ఢిల్లీలో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

మహాధర్నా

మహాధర్నా

ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు.

మహాధర్నా

మహాధర్నా

ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని, అలాకాకుండా తెలంగాణ ఆదివాసీలను నీట ముంచి పోలవరాన్ని కట్టడాన్ని జెఎసి వ్యతిరేకిస్తుందని అన్నారు. గిరిజనుల జోలికొస్తే బ్రిటీష్ వారికి పట్టిన గతే కేంద్ర ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.

మహాధర్నా

మహాధర్నా

అదేవిధంగా ముంపు గ్రామాలను ఏపిలో విలీనం చేయాలన్న చట్ట వ్యతిరేక ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహా ధర్నాలో పది జిల్లాల్లోని జెఎసి భాగస్వామ్య పక్షాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

English summary
Telangana JAC Chairman Kodandaram on Thursday said that NDA government should withdraw Polavaram ordinance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X