హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘన స్వాగతం: హైదరాబాద్‌కు కోదండ, నాగం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం నాడు తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, విఠల్ తదితరులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ చేరుకున్న వారికి తెలంగాణవాదులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో శంషాబాద్ నుంచి ఊరేగింపుగా గన్‌పార్క్ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల కల నెరవేరిందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని, అమరవీరుల త్యాగఫలమని వారు అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా జెఏసి ముందుంటుందని కోదండరాం అన్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసమే తాను బిజెపిలో చేరానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి రాష్ట్ర సాధనకు కృషి చేసిన తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్‌లకు ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయడమా లేక ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమా అనేదానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

స్వాగతం

స్వాగతం

తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండరాం, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో కార్యకర్తలు, తెలంగాణవాదులు వారికి ఘనస్వాగతం పలికారు.

శంషాబాద్ చేరుకున్న నాగం

శంషాబాద్ చేరుకున్న నాగం

తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం నాడు శంషాబాద్ చేరుకున్న బిజెపి నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు, తెలంగాణవాదులు.

ఉద్యోగుల ఆనందం

ఉద్యోగుల ఆనందం

తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, విఠల్ తదితరులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా వారికి తెలంగాణవాదులు ఘన స్వాగతం పలికారు.

శ్రీనివాస్ గౌడ్ అభివాదం

శ్రీనివాస్ గౌడ్ అభివాదం

తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న అనంతరం టిజివో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అభివాదం చేసున్న దృశ్యం.

ఊరేగింపుగా

ఊరేగింపుగా

తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న అనంతరం టిజివో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నాయకులు ఊరేగింపుగా గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు.

మిఠాయి తినిపిస్తూ..

మిఠాయి తినిపిస్తూ..

తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న టిజివో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌కు మిఠాయి తినిపిస్తున్న మహిళా ఉద్యోగిని.

నృత్యాలు చేస్తూ..

నృత్యాలు చేస్తూ..

తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న అనంతరం టిజివో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నాయకులను ఊరేగించారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తున్న తెలంగాణవాదులు.

గన్ పార్కు వద్ద నివాళులు..

గన్ పార్కు వద్ద నివాళులు..

తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో హైదరాబాదులోని గన్ పార్కు వద్ద లంబాడీలు అమర వీరులకు శనివారం నివాళులు అర్పించారు.

కండలపై జై తెలంగాణ

కండలపై జై తెలంగాణ

తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో ఓ యువకుడు ఇలా రెండు చేతులపై జై తెలంగాణ అని రాసుకుని ప్రదర్శించాడు.

గన్ పార్కు వద్ద ఇలా..

గన్ పార్కు వద్ద ఇలా..

పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ సందడి

గుండుపై 29వ రాష్ట్రం

గుండుపై 29వ రాష్ట్రం

దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందనే సంతోషంలో ఓ తెలంగాణ వ్యక్తి ఇలా క్రాఫ్ చేయించుకుని ఇలా ప్రదర్శిస్తూ కనిపించాడు.

తెరాస నేతలు..

తెరాస నేతలు..

తెలంగాణ కల సాకారమైన సందర్భంగా తెరాస శాసనసభ్యుడు శ్రీనివాస రెడ్డి పార్టీ కార్యకర్తలతో ఇలా..

English summary
Telangana JAC chairman Kodandaram and Bharatiya Janatha Party leader Nagam Janardhan Reddy and others arrived to Hyderabad from Delhi on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X