వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో పోటీకి కెసిఆర్ సీటు ఆఫర్: కోదండరామ్ నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇచ్చిన ఆఫర్‌ను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తిరస్కరించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని కోదండరామ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లకూడదని గతంలో తీసుకున్న నిర్ణయానికి నేటికీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

కోదండరాంతో పాటు టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం కెసిఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. గంటకుపైగా సమావేశమయ్యారు. పార్టీలోకి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కెసిఆర్ కోదండరామ్‌ను ఆహ్వానించారు. అయితే కోదండరాం ధన్యవాదాలు తెలిపి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అదే విషయాన్ని భేటీ తర్వాత కోదండరాం మీడియాకు వివరించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో అందరం కలిసి పనిచేస్తామని, జెఎసిగా ముందుకు వెళతామని చెప్పారు. తెరాస తరఫున పోటీ చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతు ఇస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై ఇంకా ఆలోచించలేదని కోదండరాం బదులిచ్చారు. జెఎసి నుంచి రాజకీయాల్లోకి వెళ్లేవారు వెళ్లవచ్చని గతంలో నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన వాళ్లం పునర్నిర్మాణం కోసం పనిచేస్తామని దేవీప్రసాద్ తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తెరాస నుంచి తనకు ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని, అయితే ఇప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ కూడా తెలంగాణ జెఎసి నేతలను ఆహ్వానిస్తోంది. ఓ వైపు కాంగ్రెసు, మరో వైపు తెరాస తెలంగాణ జెఎసి నేతలకు టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

English summary
Telangana political JAC chairman Kodandaram has rejected the offer of Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X