అంతా మీరేనా?: బాబు హెరిటేజ్‌ని టార్గెట్ చేసిన కోదండ

హైదరాబాదులోని ప్రతి బస్తీ బంజారాహిల్స్‌లా మారాలన్నారు. ఒక్క పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఆపితే హైదరాబాదులో మంచి నీటి సమస్య తీరిపోయేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా గుప్పెటు మంది దోపిడీదారులకే నష్టమని, సామాన్యులకు ఎలాంటి నష్టం జరగదన్నారు.
కేవలం సినిమాలు, మీడియానే కాకుండా వ్యవస్థలన్నీ సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. చివరకు పాఠ్యపుస్తకాన్ని కూడా ఎవరు రాయాలో సీమాంధ్రులే నిర్ణయిస్తారన్నారు. అన్ని రంగాలలో సీమాంధ్రులే ఉంటే తెలంగాణ ప్రాంత సమస్యలు ఎలా అర్థమవుతాయి, ఎలా తీరుతాయని ప్రశ్నించారు.
సచివాలయంలో తెలంగాణ వాళ్లు డ్రైవర్లు, లిఫ్టు ఆపరేటర్లుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఎనభై శాతం మంది సీమాంధ్రులే అన్నారు. కష్టమంతా తెలంగాణ వాళ్లదైతే ఆదాయం మాత్రం సీమాంధ్రులకా అని కోదండరామ్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications