స్పీకర్ కోడెల మనవడి కిడ్నాప్: కొడుకుపై కోడలు కేసు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణపై విశాఖపట్నంలోని త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. త్రిటౌన్ పరిధిలో నివసిస్తున్న శివరామకృష్ణ.. తన భార్య ఇంటిపై బుధవారం రాత్రి మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు తెలిసింది.
ఇంటి తలుపులు పగలగొట్టి తన అత్తామామలను బెదిరించి తన కుమారుడు గౌతమ్(4)ను తీసుకుపోయినట్లు అతని భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2009 ఆగస్టులో తనకు శివరామకృష్ణతో వివాహం జరిగిందని, అనంతరం తమ ఇద్దరి మధ్య మనస్పర్థలతో వివాదాలు చోటు చేసుకున్నాయని, అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోతున్న తనను పలుమార్లు గెంటేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2010లో తమకు బాబు పుట్టిన తర్వాత కూడా తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె చెప్పారు.
కోడెల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేధింపులు పెరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఏడాది కాలంగా విశాఖలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న తనపై దాడి చేసి కుమారుడ్ని కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications