Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ అసెంబ్లీ కొత్త డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపై ఉత్కంఠత..!!

అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఉప సభాపతిని ఎన్నుకోనుంది ఏపీ అసెంబ్లీ. దీనికోసం ఇదివరకే నోటిఫికేషన్ జారీ అయింది. ఇదివరకు డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. కోన రఘుపతి రాజీనామా చేశారు.

డిప్యూటీ స్పీకర్‌గా వైధ్య సామాజిక వర్గానికి చెందిన సీనియర్ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్ర స్వామిని ఎన్నిక కావడం దాదాపు లాంఛనప్రాయమే. ఈ పదవి కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయనగరం నుంచి కోలగట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజును ఆయన ఆరువేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

Kolagatla Veerabhadra Swamy is all set to elect New Deputy Speaker of the Andhra Pradesh Assembly.

డిప్యూటీ ఉప ఎన్నిక ప్రక్రియ ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమౌతుంది. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారం ఓ ప్రకటన చేస్తారు. అనంతరం ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈ పదవి కోసం కోలగట్ల ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమే కానుంది.

నిజానికి- కోలగట్లకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి లభిస్తుందని భావించారు. తొలి విడతలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రివర్గంలో కొనసాగడం వల్ల మలిదశలో అదే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని అప్పట్లోనే వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కోలగట్లకు ఈ పదవి లభించబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+